Indonesia Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. 20మంది మృతి, 300మందికిపైగా గాయాలు..

ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. ఈ భూకంపం దాటికి దాదాపు 20 మంది మరణించగా, 300 మంది గాయపడ్డారని సియాంజుర్ పరిపాలన అధిపతి హెర్మన్ సుహెర్మాన్ చెప్పారు.

Indonesia Earthquake: ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. ఈ భూకంపం దాటికి దాదాపు 20 మంది మరణించగా, 300 మంది గాయపడ్డారని సియాంజుర్ పరిపాలన అధిపతి హెర్మన్ సుహెర్మాన్ చెప్పారు. భూ ప్రకంపనలతో పట్టణంలోని పలు నివాసాలు నేలకూలాయని, మరికొందరు భవనాల శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని ఆయన అన్నారు.

సియాంజూర్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఇరువురిని రక్షించామని, అయితే మూడో వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు. ఓ భవనం నుంచి మేము ఒక మహిళ, శిశువును సజీవంగా బయటకు తీసుకురాగలిగాము. కానీ మరొకరు మరణించారు. ప్రస్తుతానికి నేను పంచుకోగలిగినది అదేఅని హెర్మావాన్ ఓ టీవీ ఛానెల్ తో పేర్కొన్నాడు.

ఇదిలాఉంటే ఇండోనేషియా రాజధాని జకార్తాలో సోమవారం కొన్ని సెకన్ల పాటు 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావరణ, జియోఫిజిక్స్ ఏజెన్సీ (బీఎంకేజీ) తెలిపింది. భూకంప కేంద్రం పశ్చిమ జావాలోని సియాంజార్ లో జకార్తాకు ఆగ్నేయంగా 75కి.మీ దూరంలో ఉంది. 10 కి.మీ (6.2మైళ్లు) లోతులో సునామీ వచ్చే అవకాశం లేదని బీఎంకేజీ తెలిపింది. భూ ప్రకంపనలతో జాకార్తాలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లోని కార్యాలయాల నుంచి కొంతమంది పరుగులు పెట్టగా, మరికొందరు భవనాలు కంపించినట్లు, ఫర్నీచర్ కదిలినట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు