Japan Earthquake : జపాన్ లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.2గా నమోదైంది. ఈ మధ్యే మియన్మార్, థాయిలాండ్ లో భూకంపం భయపెట్టింది. వేల మంది మృతి చెందగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు జపాన్ లో భూకంపం రావడంతో ఆందోళన మరింత పెరిగింది. రిక్టర్ స్కేల్ పై 6.2 అంటే తీవ్రత ఎక్కువగానే భావిస్తున్నారు. పలు చోట్ల భూమి కంపించింది.
అయితే, ఆస్తి ప్రాణనష్టంపై వివరాలు తెలియడం లేదు. జపాన్ కు భూకంప హెచ్చరికలు గత రెండు మూడు రోజులుగా వస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం కూడా దీనిపై రిపోర్ట్ ఇచ్చింది. 3 లక్షల మందికి భూకంపం ముప్పు ఉందన్న వార్నింగ్స్ సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. అనుకున్నట్లే జపాన్ లో భూకంపం రావడంతో భయాందోళనలు పెరిగిపోయాయి. జపాన్ చుట్టు పక్కల దేశాలు సైతం భయపడుతున్నాయి.
జపాన్‌లోని క్యుషులో బుధవారం రాత్రి 7 గంటల 34 నిమిషాలకు భారీ తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటికే వరుస భూప్రకంపనలతో మియన్మార్ చిగురుటాకులా వణికిపోయింది. మార్చి 26న మియన్మార్, థాయిలాండ్‌లో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం బీభత్సం సృష్టించింది. మరణ మృదంగం మోగించింది.
Also Read : మియన్మార్ భూకంపం వణికిస్తుంటే.. అప్పుడే పుట్టిన బిడ్డల్ని బతికించుకోవడానికి నర్సుల తాపత్రయం చూడండి..
అది జరిగిన వారం రోజుల వ్యవధిలోనే జపాన్‌లో భూకంపం రావడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఎప్పుడు ఎటువంటి ముప్పు ముంచుకొస్తుందోనని జపాన్ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. కాగా.. మియన్మార్, థాయిలాండ్ సంభవించిన భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.