Viral Video: మియన్మార్ భూకంపం వణికిస్తుంటే.. అప్పుడే పుట్టిన బిడ్డల్ని బతికించుకోవడానికి నర్సుల తాపత్రయం చూడండి..

చైనాలోని యున్నాన్ ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడు ఆసుపత్రిలోని ఇద్దరు నర్సులు అప్పుడే పుట్టిన చిన్నారులను తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన వీడియో వైరల్ అవుతుంది.

  • Published By: Mahesh T ,Published On : March 29, 2025 / 01:08 PM IST
Viral Video: మియన్మార్ భూకంపం వణికిస్తుంటే.. అప్పుడే పుట్టిన బిడ్డల్ని బతికించుకోవడానికి నర్సుల తాపత్రయం చూడండి..

Two Brave nurses protect babies in hospital

Updated On : March 29, 2025 / 1:11 PM IST

నిన్న మధ్యాహ్నం మియన్మార్, థాయిలాండ్ దేశాల్లో 7.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపాలు రెండు దేశాల్లో తీవ్ర విషాదాన్ని నింపడమే కాకుండా చాలా ఎత్తైన భవనంలు పేకమేడలా కుప్పకూలిపోయాయి. ఈ భారీ భూకంపం కారణంగా మియన్మార్, థాయిలాండ్ ఇప్పటికే మృతుల సంఖ్య 1000 దాటగా.. 2370 మంది గాయపడినట్లు తెలుస్తోంది. మియన్మార్ రాజధాని నేపిడాలో కొత్తగా నిర్మించిన 1,000 పడకల ఆసుపత్రి 7.7 తీవ్రతతో కూడిన భూకంపం వల్ల నేలమట్టం అయ్యింది. దీంతో ఇక్కడ అత్యధికంగా క్షతగాత్రులు ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

అయితే ఈ మియన్మార్ భూకంప ప్రభావం చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లోని రుయిలి నగరాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ నగరంలోని ప్రముఖ ప్రసూతి హాస్పిటల్‌లో భూకంపం సమయంలో ఆసుపత్రి బిల్డింగ్ కదులుతున్నపుడు ఇద్దరు నర్సులు అందరిలాగా బయటకు వెళ్లకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి అప్పుడే పుట్టిన చిన్నారులను కాపాడారు. (చదవండి: విషాదం.. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీస్తున్న ప్రజలు.. భూకంప భయంతో బెంబేలు..)

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భూకంపం వల్ల ఆసుపత్రి కదులుతున్న క్రమంలో చిన్నారులను కాపాడటం కోసం ఆ నర్సులు చూపిన ధైర్యసాహసంపై నెటిజన్స్ వారిని కొనియాడుతున్నారు. ఆపద నుంచి కాపాడిన ఆ నర్సుల సేవా తత్పరత, మానవత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. చుట్టూ కూలిపోతున్న భవనం, భయంతో వణికిపోతున్న సిబ్బంది మధ్య ఆ ఇద్దరు నర్సులు ప్రాణాలకు తెగించి పసిబిడ్డలను కాపాడిన క్షణాలు హృదయాలను పిండేస్తున్నాయి.