Earthquake Insurance : భూకంప బీమాపై పార్లమెంటులో చర్చ జరుగుతుండగా కంపించిన భూమి .. షాక్‌తో షేక్ అయిన సభ్యులు

ఆ దేశపు పార్లమెంట్ లో భూకంప బీమాపై వాడీ వేడీగా చర్చ జరుగుతోంది. సభ్యులంతా చర్చలో నిమగ్నమయ్యారు. పార్లమెంట్​ సభ్యులు భూకంప బీమాపై ప్రసంగిస్తున్నారు. ఇంతలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో సభ్యులంతా షాక్ అయ షేక్ అయ్యారు.

Earthquakes rattle Liechtenstein as parliament debates quake insurance

Earthquake Insurance : అది యూరోప్‌లోని ఓ చిన్న దేశమైన లిచెన్‌ స్టెయిన్‌. ఆ దేశపు పార్లమెంట్ లో భూకంప బీమాపై వాడీ వేడీగా చర్చ జరుగుతోంది. సభ్యులంతా చర్చలో నిమగ్నమయ్యారు. పార్లమెంట్​ సభ్యులు భూకంప బీమాపై ప్రసంగిస్తున్నారు. ఇంతలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో సభలో ఉన్న సభ్యులకు ఏం జరిగిందో ఒక్కక్షణం ఏమీ అర్థంకాలేదు. ఆశ్చర్యపోయారు. అసలు విషయం అర్థం అయ్యింది. కలవరపడ్డారు అందరూ. దీంతో భూకంపాలపై చర్చ భూమికంపించడంతో కాసేపు నిలిచిపోయింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Anchor swallows A fly Live on Air : లైవ్‌లో వార్తలు చదువుతూ ఈగను మింగేసిన యాంకర్

లిచెన్​స్టెయిన్ దేశం యూరోప్​లోని ఆస్ట్రియా – స్విట్జ్​ర్లాండ్​ దేశాల మధ్యలో ఉంటుంది. ఆల్ప్స్​ పర్వతాల్లో అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. దీంతో లిచెన్​స్టెయిన్​లో భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో దేశంలో భూకంపాల పరిస్థితి..బీమా వంటి అంశాలపై లిచెన్​స్టెయిన్​ పార్లమెంట్​లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ మహిళా నేత ప్రసంగిస్తున్నారు. కొంతసేపు ఆ ప్రసంగం కొనసాగింది. సరిగ్గా అప్పుడే భూమికంపించింది. ఓ నవ్వు నవ్వేసి.. ఆమె ప్రసంగాన్ని మళ్లీ మొదలుపెట్టారు నవ్వూతూ. అప్పుడు రెండోసారి మళ్లీ భూమి కంపించింది. దీంతో సదరు మహిళా నాయకురాలు కళ్లు పెద్దవి చేసుకుని అటూ ఇటూ కిందకి పైకీ చూస్తుండిపోయారు. ఈ భూ ప్రకంపనల తీవ్రత పార్లమెంటు సమావేశంలో 4.1 గా సంభవించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పార్లమెంట్‌లోని కెమెరాల్లో రికార్డయ్యాయి.

Also read : భూకంపం వ‌చ్చినా..TVలైవ్‌లో చిరునవ్వుతో ఇంట‌ర్వ్యూని కొనసాగించిన ప్ర‌ధాని: ఆమె గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్

భూకంపం కారణంగా నేతలు బయటకు వచ్చేశారు. సభను కాసేపు వాయిదా వేశారు. ఇప్పుడు, పశ్చిమ యూరోపియన్ దేశంలో అకస్మాత్తుగా ముగిసిన పార్లమెంటు సమావేశానికి సంబంధించిన చిన్న క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సభలో ఉన్న కెమెరాలు కూడా షేక్ భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లే కనిపించిందీ వీడియోలో. ఆ నేత వెనకాల ఉన్న ఓ భవనంపై భూకంపం ప్రభావం పడింది. అదంతా అక్కడి కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది.