భూకంపం వచ్చినా..TVలైవ్‌లో చిరునవ్వుతో ఇంటర్వ్యూని కొనసాగించిన ప్రధాని: ఆమె గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్

న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఓ టీవీ షోకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో భూకంపం వచ్చింది. ఆమె వెల్లింగ్టన్‌లోని పార్లమెంట్ బిల్డింగ్‌లో ద ఏఎం షోకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతగా నమోదయ్యాయి. దీంతో టీవీ హోస్ట్ ర్యాన్ బ్రిడ్జ్..ప్రధానితో ‘‘మాడమ్ మీరు ఓకేనా..భూకంపం ఆగిందా అని అడిగారు. దానికి ప్రధాని జెసిండా.. ఐయామ్ ఓకే ..షో కంటిన్యూ చేయండి..అంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అలా ఆమె ఇంటర్వ్యూని భూ ప్రకంపనలు వస్తున్నా కొనసాగించారు. ఆమె గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
వెల్లింగ్టన్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెవిన్ పట్టణంలో భూకంప కేంద్ర నమోదు అయ్యింది. ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ముఖంపై లైవ్ షోలో చిరునవ్వు ఏమాత్రం చెదరలేదు. షోను కంటిన్యూ చేశారు. ఇక్కడ స్వల్పంగా భూకంపం వచ్చిందని లైవ్ లోనే ఆమె తెలిపారు.
ఆ తరువాత సోమవారం మధ్యాహ్నం జరిగిన క్యాబినెట్ అనంతరం మీడియాతో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మాట్లాడుతూ.. తన అనుభవాన్ని తెలియజేశారు. భూప్రకంపనలు వచ్చిన సమయంలో ఇంటర్వ్యూ కొనసాగించేందుకు తనకు ఇబ్బంది లేదని..తానేమీ వేలాడే లైట్ల కింద లేననీ..చాలా బలమైన నిర్మాణం కింద ఉన్నట్లు ప్రధాని తెలిపారు.
కాగా..వెల్లింగ్టన్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉదయం 7.50 గంటలకు 5.8 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ సమయంలో కూడా ప్రధాని తన ఇంటర్వ్యూని కొనసాగించటం విశేషంగా మారింది.
Read: సెలూన్ వర్కర్ కు కరోనా..ఇంకేముంది..91మందికి పాజిటివ్ వచ్చేసింది…