అంబాసిడర్ కారు. భారతీయులకు ఎంతో అనుబంధమున్న కారు. ఎప్పుడో కనుమరుగైన పోయిన ఈ అంబాసిడర్ సరికొత్త హంగులతో మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కార్ల రూపంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. హిందూస్థాన్ మోటార్స్‌ను ఇటీవలే సొంతం చేసుకున్న ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ పీఎస్ఏ తిరిగి అంబాసిడర్ బ్రాండ్‌ను తిరిగి ప్రవేశపెట్టనుంది. 2022 నాటికి ఈ కార్లు మార్కెట్లోకి రానున్నట్టు కంపెనీ పేర్కొంది. భారతీయులతో అంబాసిడర్ కారుతో ఎంతో అనుబంధం ఉన్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంబాసిడర్‌లో డీఎస్3 క్రాస్‌బాక్ ఈ టెన్స్ ఇంజిన్‌ను అమర్చి మార్కెట్లోకి తీసుకురానుంది.
కాగా 2019 గానీ..20 గాని అంబాసిడర్ కారు మరల విడుదల కాబోతుంది. ప్రస్తుత ఆటోమొబైల్ రంగంలో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా అంబాసిడర్ కార్లను కొత్త రూపంతో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు. దీని ఇంజన్ మార్పులతో పాటు కొత్త అంబాసిడర్ కార్లు మైలేజీ బాగా ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. కొత్త అంబాసిడర్‌ను ఈనాటి కార్ల స్టైల్‌లోనే కాకుండా విశాలంగా ఉండేలా దీని డిజైన్ మార్చినట్లుగా తెలుస్తోంది. మరి మన అంబాసిడర్ కు పాత వైభవం రాబోతుందన్నమాట.
అంబాసిడర్ చరిత్ర
1970-80 లో కార్ల రారాజులా ఒక వెలుగు వెలిగిపోయింది అంబాసిడర్ కారు. బడా రాజకీయ నేతల నుండి పెద్ద పెద్ద బిసినెస్ పర్సన్స్ కూడా అంబాసిడర్ కారునే వాడేవారు. కానీ 2000 సంవత్సరం నుండి ఈ కార్ల మార్కెట్ భారీగా తగ్గిపోయింది. దీంతో 2014లో అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని ఆపేసింది హిందూస్థాన్ మోటార్స్ సంస్థ.
హిందుస్థాన్ మోటార్స్ 1948 లో అంబాసిడర్ కారును తయారు చేయాలని, వెస్ట్ బెంగాల్ లోని ఉత్తర పారాలో కేంద్ర ప్రభుత్వ అనుమతితో కారు ఫ్యాక్టరీని స్థాపించారు. భారతీయ రోడ్లకు అనుగుణంగా ఈ కారును ప్రత్యేకంగా తాయారు చేసారు. 1948లో అంబాసిడర్ కారు తయారీకి శ్రీకారం చుట్టినా.. అది తయారవడానికి 8సంవత్సరాల సమయం పట్టింది. 1956లో ఉత్పత్తికి పూర్తి చేసుకొని 1959లో మొట్టమొదటి కారును విడుదల చేసారు. ఆ తరువాత అంబాసిడర్ ఎప్పుడు వెనుదిరగలేదు. దాదాపు 50 సంవత్సరాల పాటు కింగ్ అఫ్ కార్స్‌గా వెలిగిపోయింది. ఈ క్రమంలో అంబాసిడర్ మరింత న్యూ లుక్ తో అలరిస్తుందని సమాచారం.