Elon Musk
జపాన్‌కు చెందిన ఓ పాప్ స్టార్‌కు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్పెర్మ్ డొనేట్ చేసి, తండ్రైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది.
ఆష్లే సెయింట్ క్లెయిర్ అనే మహిళ 2024లో ఎలాన్ మస్క్ వల్ల తనకు ఒక కొడుకు పుట్టాడని, ఆ పిల్లాడి పేరు రొములస్ అని చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె కొన్ని నెలల క్రితమే చెప్పింది.
ఎలాన్ మస్క్‌కు ఉన్న పిల్లల గురించి ఆష్లే సెయింట్ క్లెయిర్ తాజాగా న్యూయార్క్ టైమ్స్‌కు పలు వివరాలు తెలిపింది. ఎలాన్ మస్క్ ప్రపంచ వ్యాప్తంగా పలువురు మహిళల ద్వారా చాలామంది పిల్లలకు తండ్రి అయ్యాడని ఆమె చెప్పింది. అందులో ఒక జపనీస్ గాయని కూడా ఉందని తెలిపింది. ఆ జపనీస్ గాయని పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు.
మస్క్ తన తీరును సమర్థించుకుంటున్నారని, ఇతరులకు పిల్లలు పుట్టడానికి సాయం చేయడం ద్వారా మంచి పనులు చేస్తున్నానని అంటున్నారని ఆష్లే సెయింట్ క్లెయిర్ తెలిపారు. పిల్లలను కనాలనుకునే ఎవరికైనా సరే తన స్పెర్మ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని మస్క్ తనకు చెప్పారని పేర్కొంది.
జపాన్ అధికారులు 2023లో ఓ ప్రముఖ జపనీస్ మహిళ కోసం మస్క్‌ను స్పెర్మ్ డోనేట్ చేయాలని అడిగారని ఆష్లే సెయింట్ క్లెయిర్ తాజాగా న్యూయార్క్ టైమ్స్‌కు చెప్పింది. దీంతో ఇందుకు మస్క్ ఒప్పుకున్నారని, రొమాన్స్ చేయకుండా, కేవలం స్పెర్మ్ డొనేషన్ మాత్రమే చేశానని తనకు ఆయన మెసేజ్ ద్వారా చెప్పారని తెలిపింది. జపాన్‌కు చెందిన ఆ గాయని వివరాలను మాత్రం మస్క్ చెప్పలేదని పేర్కొంది. ఎలాన్ మస్స్‌కు ఇప్పటికే నలుగురు మహిళల ద్వారా 14 మంది పిల్లలు ఉన్నారు.