Elon Musk
Elon Musk Praises Indias Election Process: టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవల అమెరికాలో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంలో మస్క్ కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలో కొలువుదీరనున్న తన కేబినెట్ లో మస్క్ కు కీలక బాధ్యతలను ట్రంప్ అప్పగించారు. తాజాగా, ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ వేదికగా భారత్ దేశం ఎన్నికల ప్రక్రియపై ప్రశంసలు కురిపించారు.
ఈనెల ప్రారంభంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ భారీ మెజార్టీతో విజయం సాధించాడు. ఆయన వచ్చే ఏడాది జనవరి 20న రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే, కొన్నిచోట్ల ఇంకా ఆ దేశంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇంకా ఓట్లు లెక్కింపు పూర్తికాలేదు. ఈ ప్రాంతంలో మెయిల్ ద్వారా పోలైన ఓట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు 54 ఎలక్ట్రోరల్ ఓట్లను సాధించారు.
Also Read: Elon Musk: చరిత్ర సృష్టించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. చరిత్రలో ఎవరికీ లేనంత సంపద..
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఓ నెటిజన్ ‘ఎక్స్’లో ఆసక్తికర పోస్టు చేశారు. భారతదేశంలో ఒక్కరోజులోనే 640 మిలియన్ల ఓట్లను ఎలా లెక్కించారు? అనే శీర్షికతో కూడిన ఓ వార్తాపత్రిక క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఎలాన్ మస్క్ ఆ పోస్టుకు స్పందించారు. ‘భారత దేశం ఒక్క రోజులోనే ఇన్ని ఓట్లను లెక్కించింది. కానీ, కాలిఫోర్నియా ఇంకా ఓట్ల లెక్కింపులోనే ఉంది’ అంటూ మస్క్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో భారత్ లో ఎన్నికల ప్రక్రియ పై ప్రశంసల జల్లు కురిపించాడు మస్క్. దీంతో ఎలాన్ మస్క్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
India counted 640 million votes in 1 day.
California is still counting votes 🤦♂️ https://t.co/ai8JmWxas6
— Elon Musk (@elonmusk) November 24, 2024