Nagababu : మహారాష్ట్రలో బీజేపీ విజయం.. ప్రతి హీరో నాయకుడు కాలేడు.. గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అంటూ నాగబాబు ట్వీట్..

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా ఓ స్పెషల్ పోస్ట్ చేసారు.

Nagababu : మహారాష్ట్రలో బీజేపీ విజయం.. ప్రతి హీరో నాయకుడు కాలేడు.. గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అంటూ నాగబాబు ట్వీట్..

Magababu Interesting Post on Pawan Kalyan after Maharashtra Elections Results

Updated On : November 24, 2024 / 8:32 AM IST

Nagababu – Pawan Kalyan : మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. పవన్ ప్రచారం చేసిన అన్నిచోట్లా బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పవన్ కళ్యాణ్ పేరు మహారాష్ట్రలో మారుమోగిపోతుంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా పవన్ మానియా ఓ రేంజ్ లో ఉందంటూ ఫ్యాన్స్ తెగ పోస్టులు చేస్తున్నారు. మహారాష్ట్ర నాయకులు కూడా పవన్ ని అభినందిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలోనే పవన్ సభలకు, రోడ్ షోలకు భారీగా జనాలు రావడం చర్చగా మారింది. ఇప్పుడు పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాలు బీజేపీ కూటమి అభ్యర్థులు గెలవడంతో పవన్ పేరు మహారాష్ట్రలో బాగా వైరల్ అవుతుంది.

Also Read : Pawan Kalyan : జై భవానీ.. జై శివాజీ.. జై మహారాష్ట్ర అంటూ మహారాష్ట్ర విజయంపై పవన్ కళ్యాణ్ ట్వీట్..

ఇప్పటికే పవన్ ని అభినందిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పోస్టులు చేస్తుంటే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా ఓ స్పెషల్ పోస్ట్ చేసారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఛత్రపతి శివాజీ ఉన్న ఫోటో షేర్ చేసి.. గెలిచే ప్రతి నాయకుడు హీరోనే, కాని ప్రతి హీరో నాయకుడు కాలేడు. నాయకుడంటే గెలిచే వాడే కాదు. నమ్మిన సిద్ధాంతాల కోసం సైధ్దాంతిక విలువల కోసం అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం నీడై నిలబడేవాడు, తోడై నడిపించేవాడు, వారి గమ్యంలో గెలుపుని చూసుకునే వాడు, వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునే వాడు, అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు. ప్రస్తుత భారత రాజకీయాల్లో పొలిటికల్ గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అంటూ రాసుకొచ్చారు. దీంతో నాగబాబు పోస్ట్ వైరల్ గా మారింది.