Elon Musk: చరిత్ర సృష్టించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. చరిత్రలో ఎవరికీ లేనంత సంపద..
ఆయన నికర ఆస్తి విలువ దాదాపు రూ.28.22 లక్షల కోట్లు.

Elon Musk
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చరిత్రలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. 20 రోజుల్లో 70 బిలియన్ల డాలర్ల నికర విలువ పెరిగింది. ఇది మయన్మార్ జీడీపీ కంటే ఎక్కువ. ఎలాన్ మస్క్ 334.3 బిలియన్ డాలర్ల నికర ఆస్తి విలువతో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.
అంటే ఆయన నికర ఆస్తి విలువ దాదాపు రూ.28.22 లక్షల కోట్లు. ప్రపంచంలో ఇంతకుముందు అత్యంత ధనవంతుడిగా నిలిచిన వారికి ఎన్నడూ ఇంత ఆస్తి లేదు. అమెరికా అధ్యక్షుడిగా కొన్ని వారాల క్రితమే ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాలకు మస్క్ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి.
అలాగే, ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు. ట్రంప్ కొత్త ప్రభుత్వంలో ఎలాన్ మస్క్‌కు కీలక పదవి కూడా దక్కింది. దీంతో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా షేర్లలో అనూహ్య రీతిలో ర్యాలీ కొనసాగుతోంది. దాని స్టాక్స్ లో భారీగా పెరుగుదల కనపడుతోంది.
అమెరికా ఎన్నికల రోజు నుంచి ఆ సంస్థ స్టాక్ 40 శాతం పెరగింది. ఇదిలా ఉంటే శుక్రవారం ఒక్కరోజునే 3.8 శాతం పెరిగడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ దోస్తీని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మస్క్ సంపద భారీగా పెరిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీకి మరో షాక్.. గుడ్ బై చెప్పిన ఎమ్మెల్సీ, కారణం ఏంటంటే..