వైసీపీకి మరో షాక్.. గుడ్ బై చెప్పిన ఎమ్మెల్సీ, కారణం ఏంటంటే..
అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లినా..

Mlc Jayamangala Venkata Ramana : వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ కు పంపించారాయన. కైకలూరుకు చెందిన వెంకటరమణ గతంలో టీడీపీలో పని చేశారు. ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ప్రజలకు సేవ చేయలేని పదవి ఎందుకు అనే ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నానని వెంకటరమణ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లినా కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు.
వైసీపీకి మరొక ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. కైకలూరు నియోజకవర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ వైసీపీకి రిజైన్ చేశారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు శాసనమండలి ఛైర్మన్ కు లేఖను పంపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపించడం జరిగింది.
ఎమ్మెల్సీల రాజీనామా అంశంను పరిశీలిస్తే.. ఇప్పటివరకు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. కర్రి పద్మశ్రీ, చక్రవర్తి, పోతుల సునీత.. ఈ ముగ్గురు గతంలోనే తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. మండలిలో ప్రస్తుతం వైసీపీకి బలం ఉంది. దీన్ని తగ్గించాలన్నదే కూటమి ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇప్పటివరకు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పగా.. మరికొందరు వీరి బాటలోనే వెళ్తారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్సీల రాజీనామా అంశాన్ని వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఎవరైతే పార్టీని వీడి పదవికి రాజీనామా చేసి వెళ్లాలని అనుకుంటున్నారో వారితో సంప్రదింపులు కూడా జరుపుతున్న పరిస్థితి ఉంది.
Also Read : వైసీపీకి రాం రాం.. వరుసగా పార్టీని వీడుతున్న నేతలు.. ఎందుకిలా, కారణం ఎవరు?