Elon Musk: నిషేధం విధించిన ట్విట్టర్ ఖాతాలపై స్పందించిన ఎలాన్ మస్క్
ట్విట్టర్ నియమనిబంధనల కోసం ‘కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్’ను ఏర్పాటు చేయనున్నట్లు మస్క్ చెప్పారు. అప్పటి వరకు ట్విట్టర్ కంటెంట్ కు సంబంధించిన ఏ కీలక నిర్ణయాలూ తీసుకోబోమని స్పష్టం చేశారు. తాము కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్’ సమీక్ష చేయకుండా నిషేధ ట్విట్టర్ ఖాతాల పునరుద్ధరణ చేయబోమని ఎలాన్ మస్క్ అన్నారు.

Elon Musk: ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్విట్టర్ నియమనిబంధనల కోసం ‘కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్’ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అప్పటి వరకు ట్విట్టర్ కంటెంట్ కు సంబంధించిన ఏ కీలక నిర్ణయాలూ తీసుకోబోమని స్పష్టం చేశారు. ట్విట్టర్ నిబంధనల ఉల్లంఘనల కింద అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సహా అనేక మంది ఖాతాలపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే.
ఆ నిషేధాలను ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎత్తి వేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా ఎలాన్ మస్క్ స్పందించారు. తాము కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్’ సమీక్ష చేయకుండా నిషేధ ట్విట్టర్ ఖాతాల పునరుద్ధరణ చేయబోమని ఎలాన్ మస్క్ అన్నారు.
కాగా, ట్విట్టర్ ను దాదాపు రూ.3.65 లక్షల కోట్లతో కొనుగోలు చేసినట్లు ఎలాన్ మస్క్ నిన్న ప్రకటించారు. అనంతరం వెంటనే ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ తో పాటు లీగల్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దె మరో నలుగురు ఉన్నతాధికారులను తొలగించారు. దీంతో ఎలాన్ మస్క్ ట్విట్టర్ కు సంబంధించిన మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..