Donald Trump Says Elon Musk Is A Good Man But He Is Staying Away From Twitter (1)
Twitter poll: ‘అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలా?’ అంటూ ట్విట్టర్ సీఈవో, దాని కొత్త యజమాని ఎలాన్ మస్క్ ఓ పోల్ ప్రారంభించారు. 5 గంటల క్రితం ప్రారంభించిన ఈ పోల్ లో ఇప్పటివరకు 55 శాతం మంది పునరుద్ధరించాలని 45 శాతం మంది వద్దని ఓటు వేశారు. ట్విట్టర్ లో ఎలాన్ మస్క్ నిర్వహిస్తున్న ఈ పోల్ లో ఇప్పటికే దాదాపు 55 లక్షల మంది పాల్గొన్నారు.
ఈ పోల్ 24 గంటల పాటు జరుగుతుంది. ఈ పోల్ నిర్వహించే ముందు ఎలాన్ మస్క్ మరో ట్వీట్ చేశారు. ‘‘ప్రజల గళమే దేవుడి గళం’’ అని పేర్కొన్నారు. ఇటీవలే ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత గత ఏడాది జనవరి 6న కాపిటల్ భవనంపై దాడి జరగడంతో ఆ తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ట్రంప్ తన మద్దతుదారులను రెచ్చగొట్టేలా ట్వీట్లు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది మేలో ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ఎలాన్ మస్క్… ట్రంప్ ఖాతాపై స్పందించారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తానని చెప్పారు. అయితే, తన ట్విట్టర్ ఖాతాను మళ్ళీ వాడడానికి ట్రంప్ సిద్ధం లేనట్లు తెలుస్తోంది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..