Elon Musk: అమెరికాలో ఎన్నికల ఫలితాల వేళ.. ఎలాన్ మస్క్ మోసం చేశాడంటూ కోర్టులో దావా 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారు, ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ పై...

Elon Musk

Elon Musk: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఫలితాల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరుసాగుతోంది. అయితే, ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారు, ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ పై ఓటర్లకు ఒక మిలియన్ డాలర్ల నగదు పంపిణీ పై వివాదం కొనసాగుతుంది. తమను మస్క్ మోసం చేశారంటూ కోర్టులో దావా వేశారు. లక్కీ డ్రాతో విజేతలను ఎంపిక చేస్తానని చెప్పి, ముందుగా నిర్ణయించుకున్న వారికే ఫ్రైజ్ మనీ ఇస్తున్నారంటూ ఆరిజోనా నివాసి జాక్వెలిన్ మెక్ అఫెర్టీ ఫిర్యాదు చేశాడు. ఎలాన్ మస్క్, అతనికి సంబంధించిన అమెరికా ప్యాక్ సంస్థ ఓటర్లను మోసం చేసిందని ఆరోపించాడు.

Also Read: US Elections 2024 : అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు…. ఎంత సమయం పట్టినా మీ ఓటును వేయండి : ట్రంప్ పిలుపు!

వాక్ స్వాంతంత్రం, తుపాకీ కలిగి ఉండే హక్కుకు మద్దతుగా సంతకం చేసిన తటస్థ ఓటరుకు 100 డాలర్లు, మరో తటస్థ ఓటరును సిఫార్సు చేస్తే 47 డాలర్లు ఇస్తానని గత నెలలో ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలా సంతకాలు చేసిన వారిలో నుంచి ప్రతిరోజూ నవంబర్ 5వ తేదీ వరకు ఒకరిని లాటరీ ద్వారా ఎంపిక చేసి 10లక్షల డాలర్ల ఫ్రైజ్ మనీ ఇస్తానని మస్క్ ప్రకటించాడు. ఇది ఓటర్లను ప్రలోభపెట్టడమేనని డెమోక్రాట్లు ఆరోపించారు. ఓటర్లకు డబ్బులతో మస్క్ గాలం వేస్తున్నారంటూ ఫిర్యాదు చేయగా.. ఆయనకు అమెరికా జాతీయ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే, పెన్సిల్వేనియా న్యాయస్థానం మస్క్ ఫ్రైజ్ మనీకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

 

తాజాగా.. ఆస్టిన్, టెక్సాస్ ఫెడరల్ కోర్టులో ఆరిజోనా నివాసి జాక్వెలిన్ మెక్ ఆఫెర్టీ దాఖలు చేసిన ఫిర్యాదులో.. లక్కీ డ్రాతో విజేతలను ఎంపిక చేస్తానని చెప్పి, ముందుగా నిర్ణయించుకున్న వారికే ఫ్రైజ్ మనీ ఇస్తున్నారంటూ ఆరోపించాడు. మస్క్, అతనికి సంబంధించిన అమెరికా ప్యాక్ సంస్థ ఓటర్లను మోసం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.