US Elections 2024 : అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు…. ఎంత సమయం పట్టినా మీ ఓటును వేయండి : ట్రంప్ పిలుపు!

US Elections 2024 : ఎంత సమయం పట్టినా సరే చివరికి ఓటు వేసిన తర్వాతే వెళ్లాల్సిందిగా ట్రంప్ అభ్యర్థించారు.

US Elections 2024 : అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు…. ఎంత సమయం పట్టినా మీ ఓటును వేయండి : ట్రంప్ పిలుపు!

Most important day in American history

Updated On : November 6, 2024 / 1:07 AM IST

US Elections 2024 : రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన తన మద్దతుదారులకు ఓటు విలువ గురించి తెలియజేస్తున్నారు. ఈ ఎన్నికల రోజును “అమెరికన్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు”గా ట్రంప్ పేర్కొన్నారు.

ఓటు వేసేందుకు బారులు తీరిన తన మద్దతుదారులను ఓట్ల కోసం ఎంత సమయం పట్టినా సరే చివరికి ఓటు వేసిన తర్వాతే వెళ్లాల్సిందిగా ట్రంప్ అభ్యర్థించారు. ఈ మేరకు రిపబ్లికన్ అభ్యర్థి ఎక్స్ వేదికగా పోస్ట్‌లో అధిక స్థాయిలో ఓటింగ్ జరగాలని ఆకాంక్షించారు.

“ఇది ఇప్పుడు అధికారికంగా ఎన్నికల రోజు.. ఇది అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. బారులు తీరిన క్యూలతో చాలా మంది ఓటర్లు ఎంతో ఉత్సాహాంగా కనిపిస్తున్నారు. “మీ ఓటు ఎంత సమయం పట్టినా నాకు మీరు అందించాలి. క్యూ లైన్‌లో ఉండండి. రాడికల్ కమ్యూనిస్ట్ డెమోక్రాట్లు మీరు సర్దుకుని ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నారు. కలిసి, మేము అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నాం. అమెరికాను మళ్లీ గొప్పగా చేస్తాం! ” అని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, ప్రత్యర్థి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇద్దరూ గట్టి పోటీని ఇస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ అంతటా ఓటర్లు ఎన్నికల పోలింగ్ కు చేరుకుంటున్న సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

రాష్ట్రాలలో పోలింగ్ వేళలు మారుతూ ఉంటాయి. చాలా స్థానాలు స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. జార్జియాతో సహా 6 రాష్ట్రాల్లో మొదటి పోల్స్ రాత్రి 7 గంటంలకు ముగుస్తాయి. అయితే, హవాయి, అలాస్కాలో చివరి ఎన్నికలు అర్ధరాత్రి 12 గంటలకి ముగుస్తాయి. ఓటింగ్ ముగిసిన తర్వాత, ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా చిన్న రాష్ట్రాల్లో ఫలితాలు అంచనా వేస్తారు. అయితే, స్పింగ్ రాష్ట్రాలు విజేతను నిర్ణయించడానికి మరికొద్ద గంటలు పట్టవచ్చు.

2020 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత వైట్‌హౌస్‌కు చారిత్రాత్మకంగా తిరిగి రావాలని ట్రంప్‌ పట్టుదలతో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు పోటీగా అమెరికాకు మొదటి మహిళ, భారతీయ సంతతికి చెందిన అధ్యక్షురాలు కావాలనే లక్ష్యంతో కమలా హారిస్‌ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే.. శతాబ్దానికి పైగా వరుసగా రెండు పర్యాయాలు సేవలందించిన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారు.

Read Also : US Elections 2024 : ఫ్లోరిడాలో మెలానియాతో ఓటేసిన ట్రంప్‌.. గెలుపుపై విశ్వాసంతో..!