వరల్డ్ నెంబర్ వన్‌గా ఎలాన్‌ మస్క్ ఎలా ఎదిగారంటే?

Elon Musk’s life story: ఎలాన్ మస్క్.. ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు. ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఎలన్ మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా విస్తరించుకుంటూ వచ్చారు. ఎలాన్‌ మస్క్‌ పేరు వింటే చాలు.. ఎలక్ట్రిక్‌ కార్లు, సోలార్‌ బ్యాటరీలు, స్పేస్‌ రాకెట్లే గుర్తుకు వస్తాయి. దక్షిణ ఆఫ్రీకాలోని ప్రీటోరియాలో పుట్టి పెరిగిన మస్క్‌ పగటి కలలు కనేవాడు.. ఆ కలలను జీవితంలో నిజం చేసుకున్నారు.

పదేళ్ల వయసులోనే మస్క్‌ కంప్యూటర్‌ కొన్నాడు. ప్రోగ్రామింగ్‌ కోడింగ్ నేర్చుకున్నాడు. 12ఏళ్ల వయస్సు వచ్చేసరికి బ్లాస్టర్ వీడియో గేమ్ తయారుచేశాడు. ఎక్కువ లాభానికి అమ్మేశాడు కూడా. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో చేరాడు. రెండో రోజే బయటకు వచ్చేశాడు. తన కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.

తండ్రి దగ్గర అప్పు చేసిన మస్క్.. తన సోదరుడితో కలిసి ‘జిప్‌2’ అనే ఐటీ కంపెనీ ప్రారంభించాడు. జిప్‌2 కంపెనీ తరువాత మరికొంతమందిని పార్లనర్లను కలుపుకున్నాడు. అందరూ కలిసి ఎక్స్‌.కామ్‌ అనే ఆన్‌లైన్‌ ఫైనాల్సియల్‌ సర్వీస్‌ అండ్‌ ఇమెయిల్‌ పేమెంట్‌ కంపెనీ ప్రారంభించారు.

అక్కడి నుంచి మొదలైంది ఎలన్ మస్క్ ప్రయాణం. టెస్లా ఎలక్ట్రిక్‌ కారు కంపెనీ, స్పేస్‌ ట్రావెల్‌ కంపెనీ ‘స్పేస్‌ ఎక్స్‌’ వరకు మస్క్ విజయయాత్ర కొనసాగుతూనే ఉంది. మస్క్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి విరామం లేని జీవితానాన్ని గడిపాడు. ఇప్పుడు ప్రపంచ కుబేరుడిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు.