Emirates Airbus Santa Claus : శాంటా క్లాజ్ గా మారిన ఎమిరేట్స్ విమానం.. ఏర్పాటు చేసిన ఎయిర్ లైన్స్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కూడా క్రిస్మస్ హాలిడే మూడ్ లోకి వచ్చింది. ఆ సంస్థకు చెందిన ఎయిర్ బస్ ఏ380 విమానాన్ని శాంటా క్లాజ్ గా తీర్చిదిద్దింది.

Emirates Air Lines

Emirates Airbus Santa Claus : ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కూడా క్రిస్మస్ హాలిడే మూడ్ లోకి వచ్చింది. ఆ సంస్థకు చెందిన ఎయిర్ బస్ ఏ380 విమానాన్ని శాంటా క్లాజ్ గా తీర్చిదిద్దింది. ఆ విమానాన్ని రెయిన్ డీర్లు లాగుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో క్లిప్ ను విడుదల చేసింది. క్రిస్మస్ సెలవుల్లో సురక్షితమైన ప్రయాణం, సహనం వంటి సానుకూల అంశాలకు సంకేతమైన శాంటి క్లాజ్ ను గుర్తు చేసింది.

విమానం ముందు భాగంపైన శాంటా క్లాజ్ టోపీ మాదిరిగా ఎమిరేట్స్ సంస్థ ఏర్పాటు చేసింది. విమానాన్ని రెయిన డీర్లు ఆకాశంలోకి లాగుతున్నట్లుగా ఉన్న వీడియో క్లిప్ ఎంతో ఆకట్టుకుంది. కెప్టెన్ క్లాజ్, టేకాఫ్ కోసం అనుమతి కోరుతున్నారు అనే క్యాప్షన్ తో ఉన్న ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మెర్రీ క్రిస్మస్ ఫ్రమ్ ది ఎమిరేట్స్ అని విష్ చేసింది. ఈ విడీయో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే సుమారు 5 లక్షల మంది ఈ వీడియో క్లిప్ ను వీక్షించారు.

Christmas Celebrations : ప్రపంచ వ్యాప్తంగా మొదలైన క్రిస్మస్ వేడుకలు.. విద్యుత్ లైట్లతో సుందరంగా ముస్తాబైన చర్చీలు

ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. చర్చీలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ముఖ్యంగా భారత్ లోని కోల్ కత్తాలో వీధులన్నీ ప్రత్యేక లైట్లతో అలకంరించబడ్డాయి. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుతో వీధులన్నీ వెలిగిపోతున్నాయి. క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రపంచంలో క్రైస్తవులంతా పండగ మూడ్ లోకి వెళ్లారు. అనేక చోట్ల భారీ క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. అవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. షాపుల్లో క్రిస్మస్ స్పెషల్ కేకులు నోరూరిస్తున్నాయి. క్రిస్మస్ ట్రీస్, స్పెషల్ ఆర్టికల్స్ తో షాపులన్నీ నిండిపోయాయి.