Christmas Celebrations : ప్రపంచ వ్యాప్తంగా మొదలైన క్రిస్మస్ వేడుకలు.. విద్యుత్ లైట్లతో సుందరంగా ముస్తాబైన చర్చీలు

ప్రపంచమంతా క్రిస్మస్ సందడి నెలకొంది. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. చర్చీలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యాయి. ముఖ్యంగా భారత్ లోని కోల్ కత్తాలోని వీధులన్నీ ప్రత్యేక లైట్లతో అలకంరించబడ్డాయి.

Christmas Celebrations : ప్రపంచ వ్యాప్తంగా మొదలైన క్రిస్మస్ వేడుకలు.. విద్యుత్ లైట్లతో సుందరంగా ముస్తాబైన చర్చీలు

Christmas celebrations

Christmas celebrations : ప్రపంచమంతా క్రిస్మస్ సందడి నెలకొంది. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. చర్చీలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యాయి. ముఖ్యంగా భారత్ లోని కోల్ కత్తాలోని వీధులన్నీ ప్రత్యేక లైట్లతో అలకంరించబడ్డాయి. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుతో వీధులన్నీ వెలిగిపోతున్నాయి. క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రపంచంలో క్రైస్తవులంతా పండగ మూడ్ లోకి వెళ్లారు.  అనేక చోట్ల భారీ క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. అవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

షాపుల్లో క్రిస్మస్ స్పెషల్ కేకులు నోరూరిస్తున్నాయి. క్రిస్మస్ ట్రీస్, స్పెషల్ ఆర్టికల్స్ తో షాపులన్నీ నిండిపోయాయి. క్రిస్మస్ సంబరాలకు బ్రిటన్ సిద్ధమైంది. కింగ్ చార్లెస్ చక్రవర్తి 3 హోదాలో మొదటిసారి పాల్గొననుండటంతో భారీ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన వీధులన్నీ సుందరంగా ముస్తాబయ్యాయి. ఇవాళ క్రిస్మస్ వేడుకపై నుంచి కింగ్ చార్లెస్ 3 ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకలకు బ్రిటీష్ ప్రజలు భారీగా తరలిరానున్నారు.

Happy Christmas : దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు

జపాన్ రాజధాని టోక్యోలో క్రిస్మస్ సందడి మొదలైంది. రంగు రంగుల విద్యుత్ కాంతులతో
టోక్యో నగరాన్ని సుందరంగా అలంకరించారు. గత మూడేళ్లుగా కరోనా మూలంగా అంతంత మాత్రంగా జరిగినా క్రిస్మస్ వేడుకలు ఈ ఏడాది భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. టోక్యో వీధుల్లోని చెట్లు, భవనాలు, రోడ్లు విద్యుత్ కాంతులతో దగ దగ మెరిసిపతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని చర్చిల్లో క్రిస్ మస్ సందడి నెలకొంది. హైదరాబాద్ లోని చర్చీలు కూడా క్రిస్మస్ కోసం ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ లోని వెస్లీ చర్చ్, సీఎస్ఐ చర్చీతోపాటు ప్రధాన చర్చీలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. ఉదయం నుంచి క్రైస్తవులు చర్చీలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మెదక్ సీఎస్ఐ చర్చీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున 4 గంటల నుంచే ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు మొదలయ్యాయి.

Merry Christmas 2022 : మేరీ క్రిస్మస్ 2022.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో Xmas స్టిక్కర్లను ఎలా పంపాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

కార్యక్రమానికి క్రైస్తవులు వేలాదిగా తరలిరావడంతో చర్చీ ప్రాంతం రద్దీగా మారింది. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ క్రైస్తవులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. మెదక్ చర్చీలో బిషప్ సాల్మన్ రాజ్ దైవ సందేశాన్ని అందించారు. ప్రపంచ వ్యాప్త క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం 10 గంటల ప్రార్థనల తర్వాత భక్తులను చర్చీలోకి దర్శనానికి అనుమతించారు. రాత్రి 9 గంటల వరకు చర్చీ తెరిచే ఉండనుంది.మరోవైపు రద్దీకి అనుగుణంగా చర్చీలో సదుపాయాలు కల్పించారు.

క్రిస్మస్ కోసం మెదక్ చర్చిని అందంగా ముస్తాబు చేశారు. ఎత్తైన చర్చీ మెయిన్ టవర్, కమాన్లతోపాటు ప్రాంగణాన్ని కలర్ ఫుల్ గా డెకరేట్ చేశారు. రంగు రంగుల విద్యుత్ దీపాలు, బెలూన్లు, స్టార్లతోపాటు భారీ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కళ్లకు కట్టేలా పశువుల పాకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 500 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Pawan Kalyan: క్రిస్మస్ కానుకలు పంపుతున్న పవన్.. ఎవరికి వచ్చాయో తెలుసా?

బాపట్ల జిల్లా చీరాలలోని సెయింట్ మార్క్ లూథరన్ చర్చీలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
క్రిస్మస్ సందర్భంగా క్యాండిల్స్ సర్వీసు నిర్వహించారు. మరోవైపు చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో చర్చీలు విద్యుత్ దీపాలతో పండగ శోభన సంతరించుకున్నాయి. స్టార్ లైటింగ్స్ తో వీధులన్నీ వెలిగిపోతున్నాయి.

యునైటెడ్ ఎమిరేట్స్ జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కూడా క్రిస్మస్ హాలిడే మూడ్ లోకి వచ్చేసింది. ఆ సంస్థకు చెందిన ఎయిర్ బస్సు ఏ3-80 విమానాన్ని శాంటాక్లాజ్ గా తీర్చి దిద్దింది. ఆ విమానాన్ని రైన్ డీర్లు లాగుతున్నట్లుగా ఉన్న ఓ వీడియో క్లిప్ ను విడుదల చేసింది. ఆ విమానం ముందు భాగంపైన శాంటాక్లాజ్ టోపీ మాదిరిగా ఎమిరేట్స్ సంస్థ ఏర్పాటు చేసింది.రెయిన్ డీర్స్ విమానాన్ని ఆకాశానికి లాగుతున్నట్లుగా ఉన్న వీడియో క్లిప్ ఎంతో ఆకట్టుకుంటుంది.