Pawan Kalyan: క్రిస్మస్ కానుకలు పంపుతున్న పవన్.. ఎవరికి వచ్చాయో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రతి యేటా వేసవిలో తన తోటలో పండే మామిడి పళ్లను తనకు ఇష్టమైన వారికి కానుకగా ప్యాక్ చేసి పంపుతుంటాడు. వారిలో దర్శకులు త్రివిక్రమ్, నటుడు ఆలీ, నితిన్ లాంటి వారు చాలా మందే ఉన్నారు. ఇలా ప్రతియేటా పవన్ దగ్గర్నుంచి గిఫ్టులు అందుకోవడంతో వారంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు.

Pawan Kalyan Sending Christmas Gifts To Directors
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రతి యేటా వేసవిలో తన తోటలో పండే మామిడి పళ్లను తనకు ఇష్టమైన వారికి కానుకగా ప్యాక్ చేసి పంపుతుంటాడు. వారిలో దర్శకులు త్రివిక్రమ్, నటుడు ఆలీ, నితిన్ లాంటి వారు చాలా మందే ఉన్నారు. ఇలా ప్రతియేటా పవన్ దగ్గర్నుంచి గిఫ్టులు అందుకోవడంతో వారంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు.
Pawan Kalyan: టైటిల్‌తో పాటు పవన్ కటౌట్ కూడా మారుస్తానంటోన్న హరీష్ శంకర్..?
అయితే అన్నా లెజ్‌నేవాను వివాహమాడిన తరువాత ప్రతి క్రిస్మస్‌కు కూడా గిఫ్ట్స్ పంపుతున్నారు. తాజాగా క్రిస్మస్ పండుగ సమీపిస్తుండటంతో పవన్ తన కానుకలను పంపడం షురూ చేశాడు. తనకు వకీల్ సాబ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన దర్శకుడు వేణు శ్రీరామ్‌కు క్రిస్మస్ గిఫ్ట్‌ను పంపి ఆయన్ను షాక్ చేశారు పవన్ దంపతులు. తనకు పవన్ నుండి ఊహించని గిఫ్టు రావడంతో సంతోషంతో ఉప్పొంగిపోయిన ఈ డైరెక్టర్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
Pawan Kalyan : అమ్ముడుపోయే కర్మ నాకు లేదు..
ఇక పవన్ నుండి మరికొంత మందికి ఈ గిఫ్టులు వెళ్లనున్నాయి. మరి పవన్ ఈ క్రిస్మస్‌కు ఎవరెవరికి గిఫ్టులు పంపుతున్నాడో చూడాలి అంటున్నారు అభిమానులు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పవన్ ప్రస్తుతం ‘హరిహరవీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.