Happy Christmas : దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు

దేశవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యుద్దీపాల అలంకరణలో చర్చిలు మెరిసిపోతున్నాయి. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచ

  • Published By: veegamteam ,Published On : December 25, 2019 / 01:51 AM IST
Happy Christmas : దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు

దేశవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యుద్దీపాల అలంకరణలో చర్చిలు మెరిసిపోతున్నాయి. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచ

దేశవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యుద్దీపాల అలంకరణలో చర్చిలు మెరిసిపోతున్నాయి. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మెదక్‌ చర్చ్‌లో క్రిస్మస్‌ వేడుకలు తొలి ఆరాధనతో ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ విదేశాల నుండి లక్షలాదిమంది భక్తులు ఈ వేడుకలకు హాజరయ్యారు. చర్చి బిషప్‌ సోల్మన్‌ రాజు ఆధ్వర్యంలో ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదారాబాద్‌ నుండి బుధవారం(డిసెంబర్ 25,2019) తెల్లవారుజామున 4 గంటలకే భక్తులు చర్చికి చేరుకుని తొలి ఆరాధనలో పాల్గొన్నారు.

ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్‌ను పురస్కరించుకుని తమిళనాడు వ్యాప్తంగా క్రైస్తవులు అర్థరాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు భారీ కేక్ ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా హ్యాపీ క్రిస్మస్‌, మెర్రీ క్రిస్మస్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా చెన్నైలోని క్రైస్తవ ఆలయాలు విద్యుత్‌ దీపాలంకరణలో కళకళలాడాయి.

ఢిల్లీలో క్రిస్మస్‌ పండుగ సంతోషాలు వెల్లివిరిసాయి. గోల్‌ డాక్‌ ఖానా చర్చ్‌లో క్రైస్తవులు పాల్గొని భక్తిశ్రద్దలతో ప్రార్థనలు చేశారు. చర్చ్‌ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చదిద్ది..క్యాండిల్స్‌ను వెలిగించారు. రాత్రంతా క్రైస్తవులు ఎంతో ఉత్సాహంగా గడిపారు.

ముంబైలోనూ క్రిస్మస్‌ శోభ ప్రారంభమైంది. సెయింట్ మైఖల్‌ చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థానలు చేశారు క్రైస్తవ సోదరులు. అత్యధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని తమ ఆరాధ్య దైవన్నిప్రార్థించారు. అందరూ ఎల్లప్పుడు తమ జీవితాలను ఆనందంగా గడపాలని మత పెద్దలు అశీర్వదించారు.

కోల్‌కత్తాలో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నింటాయి. అర్థారాత్రి చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చ్‌ను అందంగా అలంకరించారు. వివిధ రకాల క్రిస్మస్‌ ట్రీస్‌తో చర్చ్‌ ప్రాంగాణాన్నిముస్తాబు చేశారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని.. ప్రతి ఒక్కరు శాంతితో మెలగాలని.. ఇతరులకు హాని తలపెట్టవద్దని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

* దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్‌ వేడుకులు
* అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
* విద్యుద్దీపాల అలంకరణలో మెరిసిపోతున్న చర్చిలు
* అంబరాన్ని అంటిన క్రిస్మస్ సంబరాలు