Merry Christmas 2022 : మేరీ క్రిస్మస్ 2022.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో Xmas స్టిక్కర్లను ఎలా పంపాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Merry Christmas 2022 : మేరీ క్రిస్మస్ 2022 (Merry Christmas 2022) పండుగ సెలవు సీజన్ వచ్చేసింది. ప్రస్తుత రోజుల్లో వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ఎన్నో సోషల్ ప్లాట్ ఫారంలు అందుబాటులోకి వచ్చేశాయి.

Merry Christmas 2022 : మేరీ క్రిస్మస్ 2022.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో Xmas స్టిక్కర్లను ఎలా పంపాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Merry Christmas 2022 _ Here’s how to send Xmas stickers on WhatsApp, Instagram

Merry Christmas 2022 : మేరీ క్రిస్మస్ 2022 (Merry Christmas 2022) పండుగ సెలవు సీజన్ వచ్చేసింది. ప్రస్తుత రోజుల్లో వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ఎన్నో సోషల్ ప్లాట్ ఫారంలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పుడు మీ కుటుంబం, స్నేహితులు, ప్రియమైన వారికి గ్రీటింగ్ కార్డ్‌లు, టెలిఫోనిక్ శుభాకాంక్షలు పంపుకోవచ్చు. ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram), (WhatsApp) స్టిక్కర్‌లతో శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో లైవ్ క్రిస్మస్ స్టిక్కర్‌లను ఎలా పంపాలో ఇప్పుడు చూద్దాం..

WhatsAppలో క్రిస్మస్ స్టిక్కర్లను పంపడం ఎలా? :
క్రిస్మస్ స్టిక్కర్‌లను పంపేందుకు యూజర్లు తప్పనిసరిగా వాటిని ప్లే స్టోర్ (Play Store) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. గూగుల్ Play స్టోర్‌కి వెళ్లండి. అక్కడ నుండి నచ్చిన ఏదైనా స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేయండి. ఈ స్టిక్కర్ ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసిన తర్వాత యూజర్లు తమ యాప్‌లో మల్టీ స్టిక్కర్ ప్యాక్‌లను చూడవచ్చు. అన్నీ వాటి పక్కన ఉన్న Add బటన్‌తో ప్లస్ (+) ఆకారంలో ఉంటాయి. యూజర్లు తమ WhatsApp యాప్‌లో ఈ స్టిక్కర్‌లను యాడ్ చేసేందుకు ఈ బటన్‌లను Tap చేయవచ్చు.

Read Also : WhatsApp Verification Feature : వాట్సాప్‌లో కొత్త వెరిఫికేషన్ ఫీచర్ వస్తోంది.. మీ అకౌంట్ ఎవరూ యాక్సెస్ చేసినా మీకు ఇట్టే తెలిసిపోతుంది..!

వాట్సాప్‌కు ఈ స్టిక్కర్‌లను యాడ్ చేసిన తర్వాత యూజర్లు తమ వాట్సాప్‌కు వెళ్లి, ఏదైనా కాంటాక్టులతో చాట్ విండోను ఓపెన్ చేయవచ్చు. ఆ తర్వాత వారికి నచ్చిన స్టిక్కర్‌లను ఎంచుకోవడం ద్వారా ఏదైనా స్టిక్కర్‌ను పంపవచ్చు. వినియోగదారులు ఎమోజి సెక్షన్ ఓపెన్ చేసి, స్టిక్కర్‌ల కోసం కుడివైపున ఉన్న ట్యాబ్‌కు వెళ్లవచ్చు. అన్ని కొత్త క్రిస్మస్ స్టిక్కర్‌లను పొందవచ్చు.

Merry Christmas 2022 _ Here’s how to send Xmas stickers on WhatsApp, Instagram

Merry Christmas 2022 _ Here’s how to send Xmas stickers on WhatsApp, Instagram

Instagramలో క్రిస్మస్ స్టిక్కర్లను పంపాలంటే? :
ఇన్‌స్టాగ్రామ్‌లో క్రిస్మస్ స్టిక్కర్‌లను పంపేందుకు యాప్‌లో డైరెక్ట్ మెసేజ్‌లను ఓపెన్ చేయాలి. ఆపై రిసీవర్ చాట్ విండోను ఓపెన్ చేయండి. దిగువన ఉన్న టెక్స్ట్-టైపింగ్ బార్ పక్కన స్టిక్కర్ ఐకాన్ కనిపిస్తుంది. స్టిక్కర్-సెర్చ్ బార్‌ను ఓపెన్ చేసేందుకు బటన్‌పై Tap చేయండి. ఫెస్టివల్ స్టిక్కర్‌లను కనుగొనడానికి Christmas అని టైప్ చేయండి.

ఈ స్టిక్కర్లలో దేనినైనా Tap చేస్తే చాలు.. ఇంతలో, ఇన్‌స్టాగ్రామ్ యాక్సెస్ సమస్యలను ఎదుర్కొంటున్న అకౌంట్లను సాయం చేసేందుకు ‘Hack’ హబ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం.. అకౌంట్ యాక్సెస్ సమస్యలను నివేదించడానికి లేదా పరిష్కరించడానికి యూజర్లు Instagram.com/hacked ద్వారా తిరిగి పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Fake WhatsApp Messages : వాట్సాప్‌లో ఫేక్ మెసేజ్‌లతో జాగ్రత్త.. కొత్త కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివే.. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను ఎలా గుర్తించాలో తెలుసా?