Fake WhatsApp Messages : వాట్సాప్‌లో ఫేక్ మెసేజ్‌లతో జాగ్రత్త.. కొత్త కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివే.. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను ఎలా గుర్తించాలో తెలుసా?

Fake WhatsApp Messages : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు హెచ్చరిక.. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లతో తస్మాత్ జాగ్రత్త.. నిత్యం వాట్సాప్‌‌లో ఫొటోలు లేదా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా ఫేక్ మెసేజ్ లే ఎక్కువగా కనిపిస్తుంటాయి.

Fake WhatsApp Messages : వాట్సాప్‌లో ఫేక్ మెసేజ్‌లతో జాగ్రత్త.. కొత్త కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివే.. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను ఎలా గుర్తించాలో తెలుసా?

Beware of fake WhatsApp messages with new Covid Omicron variant symptoms, details_ how to spot fake messages

Fake WhatsApp Messages : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు హెచ్చరిక.. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లతో తస్మాత్ జాగ్రత్త.. నిత్యం వాట్సాప్‌‌లో ఫొటోలు లేదా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా ఫేక్ మెసేజ్ లే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, వాట్సాప్ యూజర్లకు ఇందులో ఏది ఫేక్ న్యూస్ అనేది గుర్తించడం కష్టంగా మారుతోంది.

వాట్సాప్ ద్వారా ఫేక్ వార్తలతో పాటు తప్పుడు సమాచారానికి అడ్డగా మారింది. కరోనా సమయంలో ఇలాంటి ఫేక్ సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందింది. డెల్టా కన్నా Omicron XBB సబ్‌వేరియంట్ డేంజరస్ అంటూ వాట్సాప్‌లో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. చైనాలో పెరుగుతున్న కరోనా మధ్య, డెల్టా వైరస్ కన్నా కొత్త వేరియంట్ ప్రాణాంతకం అని ప్రజలను భయపెట్టే కొత్త ఫేక్ మెసేజ్ వాట్సాప్‌లో వైరల్ అయింది.

ఆ ఫేక్ మెసేజ్‌లో Omicron కొత్తగా గుర్తించిన XBB సబ్‌వేరియంట్ ఐదు రెట్లు ఎక్కువ ప్రాణాంతకమని, డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ మరణాల రేటును కలిగి ఉందని పేర్కొంది. దీని లక్షణాలు ఇతర సబ్-వేరియంట్‌ల నుంచి భిన్నంగా ఉన్నాయని మెసేజ్ హెచ్చరించినట్టుగా ఉంది.

వెంటనే అప్రమత్తమైన ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ మెసేజ్ నమ్మవద్దని లేదా దానిని ఇతరులకు షేర్ చేయరాదని ప్రజలకు సూచించింది. ఇలాంటి మెసేజ్ ఫార్వార్డ్ అయినప్పుడు ఏది ఫేక్ న్యూస్ అనేది గుర్తించడం ఎలా అనేది కష్టమే.. కొన్నిసార్లు ఈ వైరల్ మెసేజ్ విశ్వసనీయంగా కనిపిస్తాయి.

Read Also : Fake WhatsApp Apps : ఈ ఫేక్ వాట్సాప్ యాప్‌లు వాడుతున్నారా? మీ డేటా డేంజర్‌లో పడినట్టే.. సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..!

యూజర్లు ఈ మెసేజ్‌లను చూడగానే వారి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి ఫార్వార్డ్‌లుగా స్వీకరిస్తారు. ఈ మెసేజ్ మళ్లీ చెక్ చేయకుండా ఫార్వార్డ్ చేస్తుంటారు. ఫేక్ మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయవద్దని వాట్సాప్ కూడా తమ యూజర్లను కోరుతోంది. అలాంటి మెసేజ్‌లను గుర్తించడానికి ఫార్వార్డ్ మెసేజ్ నిజమైనదా లేదా ఫేక్ అని గుర్తించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

Beware of fake WhatsApp messages with new Covid Omicron variant symptoms, details_ how to spot fake messages

Beware of fake WhatsApp messages with new Covid Omicron variant symptoms, details_ how to spot fake messages

ఫేక్ వాట్సాప్ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి :
ఫార్వార్డ్ మెసేజ్ లేబుల్ చెక్ చేయండి : ఏదైనా మెసేజ్‌ని చాలాసార్లు షేర్ చేస్తే.. వాట్సాప్ మెసేజ్‌పై ‘forwarded multiple time’ గుర్తును చూపిస్తుంది. ‘ఫార్వార్డ్ చేసిన లేబుల్‌లు మెసేజ్ వాస్తవానికి మీ కుటుంబం లేదా స్నేహితుని ద్వారా పంపారా లేదా వేరొకరి నుంచి ఫార్వార్డ్ అయిందా అని గుర్తించడంలో మీకు సాయపడుతుంది.

Fact Check : ఫోటోలు, వీడియోలను ఫోటోషాప్ చేయవచ్చు. మీడియాను జాగ్రత్తగా విశ్లేషించి ఏదైనా విశ్వసనీయ మూలాల ద్వారా వచ్చిందో లేదో చెక్ చేయండి.

ఫార్వార్డ్ చేసే ముందు ధృవీకరించండి : ఫేక్ అనిపించే లేదా సమాచారం లేని మెసేజ్ ఎప్పుడూ ఫార్వార్డ్ చేయవద్దు. వార్తల సైట్‌లు లేదా ఇతర విశ్వసనీయ వెబ్‌సైట్‌ల నుంచి ధృవీకరించండి. అందుకు Googleలో సమాచారం గురించి సెర్చ్ చేయండి.

ఫిషింగ్ లేదా ఫేక్ మెసేజ్‌లను రిపోర్ట్ చేయండి : మీకు తెలియని నంబర్ నుంచి మెసేజ్ వస్తే.. క్రాస్ చెక్ చేయండి. మీకు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే.. మెసేజ్, నంబర్‌ను రిపోర్ట్ చేయండి. తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు భావించే గ్రూపు నుంచి యూజర్లకు కూడా మీరు నివేదించవచ్చు.

గ్రూపు ప్రైవసీ సెట్టింగ్‌లను ఉపయోగించండి : ప్రైవసీని నిర్ధారించడానికి, తెలియని యూజర్ల నుంచి ఏవైనా అవాంఛిత గ్రూపులకు యాడ్ చేయకుండా నిరోధించడానికి.. మీరు ‘గ్రూప్ ప్రైవసీ’ సెట్టింగ్‌లను ఉపయోగించవచ్చు. గ్రూపులలో సెట్టింగ్‌లను కూడా మార్చవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp DND Feature : వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం కొత్త DND ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందో తెలుసా?