Fake WhatsApp Apps : ఈ ఫేక్ వాట్సాప్ యాప్‌లు వాడుతున్నారా? మీ డేటా డేంజర్‌లో పడినట్టే.. సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..!

Fake WhatsApp Apps : మీరు వాట్సాప్ వాడుతున్నారా? యూజర్ల డేటా ప్రైవసీ విషయంలో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు Kaspersky సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు. చాలామంది యూజర్లు YoWhatsApp వాడుతున్నట్టు గుర్తించారు.

Fake WhatsApp Apps : ఈ ఫేక్ వాట్సాప్ యాప్‌లు వాడుతున్నారా? మీ డేటా డేంజర్‌లో పడినట్టే.. సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..!

Fake WhatsApp apps spotted stealing users’ data Here’s what you should do

Fake WhatsApp Apps : మీరు వాట్సాప్ వాడుతున్నారా? యూజర్ల డేటా ప్రైవసీ విషయంలో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు Kaspersky సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు. చాలామంది యూజర్లు YoWhatsApp వాడుతున్నట్టు గుర్తించారు. ఈ వాట్సాప్ వెర్షన్ 2.22.11.75‌లో Trojan.AndroidOS.Triada.eq అని పిలిచే డేంజరస్ మాడ్యూల్‌ను ఉందని గుర్తించారు.

ఈ మాడ్యూల్ యూజర్ల డివైజ్‌లలో మాల్వేర్‌ను డీక్రిప్ట్ చేస్తుందని నిర్ధారించారు. డేంజరస్ మాడ్యూల్ WhatsApp పని చేయడానికి అవసరమైన వివిధ కీలను తస్కరిస్తున్నట్టు గుర్తించారు. యాప్ లేకుండా WhatsApp అకౌంట్ ఉపయోగించేందుకు అనుమతించే ఓపెన్ సోర్స్ యుటిలిటీలలో సైబర్ నేరగాళ్లు కొన్ని ఆసక్తికరమైన కీలు ఉపయోగించే వీలుంది. ఈ కీలలో డేంజరస్ WhatsApp మోడ్ ద్వారా యూజర్ అకౌంట్లపై కంట్రోల్ కోల్పోయే ప్రమాదం ఉంది.

మరో WhatsApp knockoff – YoWhatsAppలో కూడా డేంజరస్ మోడ్‌ను కలిగి ఉంది. YoWhatsApp అనేది ఇంటర్‌ఫేస్‌ను లేదా పర్సనల్ చాట్‌లకు యాక్సెస్‌ను నిరోధించే కొన్ని అదనపు ఫీచర్‌లతో పనిచేస్తుంది. ఇన్‌స్టాల్ చేసినప్పుడు SMSకు యాక్సెస్ వంటి అసలు WhatsApp మెసెంజర్ వలె పర్మిషన్లను అడుగుతుంది.

Fake WhatsApp apps spotted stealing users’ data Here’s what you should do

Fake WhatsApp apps spotted stealing users’ data Here’s what you should do

అయితే, ఇదే అనుమతులు ట్రయాడా ట్రోజన్ ఇలాంటి మాల్వేర్‌లకు మారుతుంటాయి. ఈ మాల్వేర్‌లు వినియోగదారుకు తెలియకుండానే పేమెంట్ మెంబర్‌షిప్‌లను కూడా యాడ్ చేస్తుంటాయి. Kaspersky ప్రకారం.. అధికారిక స్నాప్‌ట్యూబ్ యాప్ (MD5: C3B2982854814E537CD25D27E295CEFE)లో వినియోగదారు WhatsApp యాడ్స్‌పై క్లిక్ చేసినప్పుడు.. యూజర్లకు డేంజరస్ బిల్డ్‌ను ఇన్‌స్టాల్ చేయమని ప్రాంప్ట్ అడుగుతుంది.

మీరు సేఫ్‌గా ఎలా ఉండవచ్చంటే :
అధికారిక WhatsAppని మాత్రమే ఇన్‌స్టాల్ చేయడం మంచిది. Google Play Store, App Store నుంచి మాత్రమే వాట్సాప్ ఇన్‌స్టాల్ చేయాలి. ఒకవేళ మీరు అలాంటి ఫేక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసినట్లయితే.. వెంటనే దాన్ని మీ ఫోన్ నుంచి డిలీట్ చేసేయండి. అలాగే, యాప్‌ని మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసే ముందు ఎల్లప్పుడూ పర్మిషన్లను చెక్ చేయండి. సైబర్‌ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ ESET లేటెస్ట్ వార్నింగ్ రిపోర్టు – T2 2022 థ్రెట్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. GB WhatsApp – వాట్సాప్ క్లోన్డ్, థర్డ్-పార్టీ అనధికారిక వెర్షన్. భారత్‌లో యూజర్ల చాట్‌లపై నిఘా పెట్టింది.

ఈ క్లోన్ చేసిన యాప్ Google Play Storeలో అందుబాటులో లేదు. వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఎలాంటి సెక్యూరిటీ చెకింగ్ లేనప్పుడు, మాల్వేర్‌తో కూడిన యాప్ మల్టీ వెర్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Edit Button : ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌లో ఎడిట్ బటన్ వస్తోంది.. పంపిన మెసేజ్ ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు!