China (1)
China : ఉద్యోగులు మెడికల్ లీవ్‌ల కోసం రుజువు, ఖర్చుల బిల్లులను సమర్పించడం కార్పొరేట్ ప్రపంచంలో సర్వసాధారణం. కానీ, ఆఫ్‌బీట్ పద్ధతిలో హాంకాంగ్‌లోని ఒక బాస్ సెలువులు అడిగిన తన ఉద్యోగి నుండి ఒక విచిత్రమైన రుజువు కావాలని డిమాండ్ చేశాడు. ఇది ప్రపంచంలో మరెక్కడా ఊహించనిది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. చింగ్ మింగ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి 12 రోజులు సెలువు కావాలని కోరిన ఉద్యోగిని ఓ బాస్ పూర్వీకుల సమాధి ఫొటోలు రుజువుగా పంపాలని అడిగాడు.
చింగ్ మింగ్ ఫెస్టివల్ అనేది చైనీస్ కుటుంబాలు తమ పూర్వీకుల సమాధులను సందర్శించి వాటిని శుభ్రపరిచి, కర్మకాండలను సమర్పించే ఫెస్టివల్ జరుపుకుంటారు. కానీ ఆ ఉద్యోగిని ఆశ్చర్యపరిచే విధంగా సెలవు సెలవు రోజులకు ముందు అతని పూర్వీకుల సమాధుల ఫొటోలను పంపమని యజమాని అడిగాడు. ఆ వ్యక్తి తన యజమాని డిమాండ్ గురించి ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశాడు.
తన పూర్వీకులకు గౌరవం ఇవ్వడానికి సెలవులు అడిగానని కానీ, దానిని నిరూపించడానికి తన యజమాని తన పూర్వీకుల సమాధుల ఫొటోలు తీయించాడని పేర్కొన్నారు. అతని పోస్ట్‌తో హాంకాంగ్ ఉన్నతాధికారులు వెర్రిమఖాలు వేస్తూ, అతన్ని కూడా వెర్రివాడిగా మార్చారు. ‘మీ పూర్వీకులకు గౌరవం ఇవ్వడానికి మీరు నిజంగా 12 రోజులు సెలవు తీసుకోవాలా?’ అని యజమాని అతని అడిగాడు.
మరోవైపు కరోనా నిబంధలను ఎత్తివేసిన తరువాత మూడు సంవత్సరాలలో మొదటిసారిగా హాంగ్ కాంగ్ నివాసితులు ఏప్రిల్ లో “సమాధి-స్వీపింగ్” పండుగ చింగ్ మింగ్ కోసం ప్రధాన భూభాగానికి తిరిగి వస్తున్నారని వార్తా సంస్థ నివేదించింది.హాంకాంగ్‌కు సరిహద్దుగా ఉన్న దక్షిణ చైనీస్ ప్రావిన్స్ గ్వాంగ్‌డాంగ్‌లోని ఫోషన్ అనే నగరానికి చెందిన వ్యక్తి పోస్ట్‌పై సానుభూతి చూపిప్తూ చాలా మంది కామెంట్స్ చేశారు. వారిలో కొందరు ఆయన రాజీనామా చేయాలని కూడా సూచించారు.