Russian TV Channel: యుద్ధం వద్దంటూ లైవ్‌లో రాజీనామా చేసిన రష్యన్ టీవీ ఛానెల్ స్టాఫ్
రష్యన్ టెలివిజన్ ఛానెల్ స్టాఫ్ మొత్తం ఒక్కసారిగా రాజీనామాలు ఇచ్చేశారు. ఆ ఛానెల్ ప్రసారం చేసిన ప్రోగ్రాంలో నో టూ వార్ (యుద్ధం వద్దు) అనే కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసిన అనంతరం....

Ukraine Media Subhan 10tv
Russian TV Channel: రష్యన్ టెలివిజన్ ఛానెల్ స్టాఫ్ మొత్తం ఒక్కసారిగా రాజీనామాలు ఇచ్చేశారు. ఆ ఛానెల్ ప్రసారం చేసిన ప్రోగ్రాంలో నో టూ వార్ (యుద్ధం వద్దు) అనే కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసిన అనంతరం ముకుమ్మడిగా లైవ్ లో తమ రాజీనామాలను ఇచ్చేశారు. అంతకంటే ముందు యుక్రెయిన్‌పై యుద్ధానికి సంబంధించిన ఆపరేషన్స్‌ను ప్రసారం చేసిందని TV Rain ఛానెల్ ను సస్పెండ్ చేశారు రష్యా అధికారులు.
ఛానెల్ ఫౌండర్స్‌లో ఒకరైన నటాలియా సిందెయెవా మాట్లాడుతూ.. యుద్ధం వద్దు అనే ప్రోగ్రాం తర్వాత ఉద్యోగులు రాజీనామాలు ఇచ్చి స్టూడియో నుంచి వెళ్లిపోయారని అన్నారు. ఆ తర్వాత ఛానెల్ ఇచ్చిన మరో స్టేట్మెంట్ లో దాని ప్రసారాలను ఎటువంటి సూచనల్లేకుండానే సస్పెండ్ చేశారని పేర్కొన్నారు.
ఈ పూర్తి వీడియోను రైటర్ డేనియల్ అబ్రహం లింక్‌డ్ఇన్ లో షేర్ చేశారు.
Read Also : సైన్యంపై తప్పుడు ప్రచారం చేస్తే 15ఏళ్ల జైలు శిక్ష, రష్యా కొత్త చట్టం
స్టాఫ్ మొత్తం రాజీనామా చేసి బయటకు వెళ్లిన తర్వాత.. Swan Lake బ్యాలెట్ వీడియో టెలికాస్ట్ అయింది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినప్పుడు ప్రసారం చేసిన వీడియోలను మరోసారి టెలికాస్ట్ చేశారు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇఖో మాస్కో రేడియో స్టేషన్ ను కూడా యుక్రెయిన్ పై యుద్ధం గురించి చేస్తున్న ప్రసారాల రీత్యా మూసేశారు. అయినప్పటికీ తాము యూట్యూబ్ లో ప్రసారాలు కొనసాగిస్తామని యాజమాన్యం చెప్తుంది. ఛానెల్ ప్రసారాలను నిలిపేస్తుండటాన్ని బట్టి చూస్తే యుక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులను ప్రసారం చేయొద్దని రష్యన్ మీడియాకు ఆంక్షలు విధించినట్లు స్పష్టంగా తెలుస్తుంది.