ఇక్కడ కార్లకే దిక్కులేదు : ఆ ఊళ్లో ఇంటికో విమానం

ఒకప్పుడు టూవీలర్ కొనుక్కోవాలంటే ఆలోచించవలసి వచ్చేది.కానీ ఇప్పుడు దాదాపు ప్రతీ ఇంటిలోను టూవీలర్ సర్వసాధారణంగా మారిపోయింది. ఇంకొంచె ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఫోర్ వీలర్ (కారు)కూడా కొనుక్కుంటున్నారు. కానీ మనం ఓ విమానం కొనుక్కోవాలంటే!..హమ్మో..ఊహకే అందని విషయం కదూ..కానీ ఓ గ్రామంలో మాత్రం ప్రతీ ఇంటికీ ఓ విమానం కామన్ గా ఉంటుంది. ఇంటి ముందు బైక్ పార్క్ చేసినట్టుగా..వాళ్లు ఇంటి ముందు విమానం పార్క్ చేసుకుంటారు.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో స్ర్పూస్ క్రీక్ అనే గ్రామం ఇది. ఈ గ్రామ ప్రజల లైఫ్ స్టైల్ వెరీ వెరీ డిఫరెంట్ గా ఉంటుంది. స్ర్పూస్ క్రీక్ గ్రామంలో 1300 కుటుంబాలుంటాయి.ప్రైవేట్ గేటెడ్ విలేజ్‌గా పిలిచే ఈ ఊళ్లో ఇంటికో విమానం కనిపిస్తుంది. వాళ్లు ఎక్కడికన్నా వెళ్లాలంటే ఎంచక్కా విమానం వేసుకుని ఎగిరిపోతారు. దాని కోసం ఆ ఊళ్లో ప్రత్యేకంగా రన్‌వేను ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచంలో రెసిడెన్షియల్ ఎయిర్‌పార్క్ ఉన్న ఊరు ఇదొక్కటే కావటం విశేషం.
విమానాలు నడపటం కోసం గ్రామంలో ఫ్లయింగ్ క్లబ్‌లు, విమానం నడపడంలో ట్రైనింగ్ అందించే సంస్థలను ఏర్పాటుచేసుకున్నారు. అక్కడే అందరూ విమానం నడపడంలో ట్రైనింగ్ తీసుకుంటారు. కాగా ప్రతీ శనివారం రోజున రోడ్లపై విమానాలు క్యూ కట్టి ఉంటాయి. గ్రామస్థులంతా రన్‌వే దగ్గర కలుసుకుంటారు. తరువాత అందరూ కలిసి బ్రేక్ చేయాలంటే విమానాలు వేసుకుని జాలీగా వెళ్లిపోతారు. స్ర్పూస్ క్రీక్ విలేజా మజాకానా..