OnlyFans page : పోలీసు ఉద్యోగాన్ని వదిలి..అడల్ట్ స్టార్ గా అందాల ఆరబోత
పురుషాధిక్య వాతావరణంతో ఆ మహిళా పోలీసు అధికారి విసిగిపోయింది. దీంతో అనూహ్యంగా ఓ నిర్ణయం తీసుకున్నారు.

Ex-cop Charlie Rose
Ex-cop : పురుషాధిక్య వాతావరణంతో ఆ మహిళా పోలీసు అధికారి విసిగిపోయింది. దీంతో అనూహ్యంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. అడల్ట్ స్టార్ గా అందాల ఆరబోతను ఎంచుకున్నారు. కెరీర్ మార్పునకు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆమెకు కాసుల వర్షం కురుస్తోంది. ఓన్లీ ఫ్యాన్స్ వేదికపై తన వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ..ఇప్పటికే 2.3 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఓన్లీ ఫ్యాన్స్ ఆన్ లైన్ వేదిక ద్వారా..తమకు ఇష్టమైన అడల్ట్ స్టార్ ఫెర్మామెన్స్ చూసేందుకు సబ్ స్క్రిప్షన్ కింద డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ సభ్యత్వం కింద సబ్ స్కైబర్లకు క్రియేటర్లు తమ కంటెంట్ ను విక్రయిస్తుంటారు.
చార్లెట్ రోజ్…పోలీసు అధికారిగా పనిచేశారు. కానీ..పురుషాధిక్య పని వాతావరణంలో ఇమడలేకపోయానని. అందుకే ఏడాది పాటు పని చేసిన తర్వాత..ఉద్యోగాన్ని విడిచిపెట్టడం జరిగిందన్నారు. ఏడేండ్ల కిందట చార్లెట్ రోజ్ పోలీసు ఉద్యోగాన్ని వదిలారు. అప్పుడు తన వయస్సు 20 ఏండ్లని రోజ్ గుర్తు చేసుకున్నారు. ఓ స్నేహితుడి సూచన మేరకు..గ్లామరస్ కారు ముందు నిలబడి ఫొజులిచ్చే ఫొటోల్లో నటించినట్లు తెలిపారు. 2016లో ఓన్లీఫ్యాన్స్ యాప్ తనను ఆహ్వానించగా..ఆ వేదికపై యూజర్లను ఆకట్టుకున్నట్లు, ఓన్లీ ఫ్యాన్స్ అంటే కేవలం పోర్న్ కంటెంట్ అనుకుంటారని తెలిపారు. కానీ..దీనికి తాను వ్యతిరేకం కాకపోయినా..వ్యక్తిగతంగా ఆ స్థాయి కంటెంట్ కు తాను దూరమన్నారు రోజ్.