యాపిల్ ను గట్టిగా కొరికిన కరోనా : న్యూయార్క్ లో కోవిడ్-19 విలయతాండవానికి కారణం ఇదే

అమెరికాలో కరోనా కేసులు,మరణాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా రికార్డు స్థాయిలో అగ్రరాజ్యంలో కరోనా కేసులు,మరణాలు నమోదవుతున్నాయి. ఎంత ప్రయత్నించినా కరోనాకు అమెరికా అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఇప్పటివరకు అమెరికాలో 5లక్షల 60వేల433 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.22వేల 115మంది మరణించారు. ప్రపంచంలోని ఏ ఇతర దేశంలోనూ ఈ స్థాయిలో కరోనా కేసులు,మరణాలు నమోదుకాలేదు.

అందులోనూ ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో నమోదైనన్ని కరోనా కేసులు మరే ఇతర దేశంలోనూ నమోదుకాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్ లో కరోనా విలయతాండవం చేస్తుంది. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే ఇప్పటివరకు 189,415మందికి కరోనా సోకగా, 9,385 మరణాలు నమోదయ్యాయి. అంటే అమెరికా వ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల్లో సగం ఒక్క న్యూయార్క్ లోనే నమోదయ్యాయి. అయితే న్యూయార్క్ ఎందుకు ఇంత దారుణంగా కరోనా ప్రభావానికి గురైందో చూద్దాం.

న్యూయార్క్ మరింత హాని కలిగి ఉందా?

సాంద్రత మరియు విదేశీ సందర్శకుల సంఖ్య న్యూయార్క్ నగరాన్ని దాదాపు 93,000 ధృవీకరించిన కేసులను కలిగి ఉండేలా చేసిందని గవర్నర్ ఆండ్రూ క్యూమో పదేపదే చెప్పారు. ఇది అంటు వ్యాధి న్యూయార్క్ లో భారీగా ప్రబలడానికి కారణమన్నారు. అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ లో 86లక్షల మంది నివాసితులు ఉన్నారు. ఒక చదరపు కిలోమీటరకు 10వేల మంది జనాభాతో అమెరికాలోనే అధికసాంద్రత ఉన్న సిటీగా న్యూయార్క్ నిలిచింది. న్యూయార్క్ యొక్క ప్యాక్డ్ సబ్ వే సిస్టమ్ లో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ఒకరికొకరు దూసుకుపోతారు. అయితే కొన్నిసార్లు ఇరుకైన కాలిబాటలపై దూరం ఉంచడం కష్టం.

ప్రతిరోజూ న్యూయార్క్ కు వేలమంది పర్యాటకులు వస్తుంటారు. ఏటా 60లక్షలమందికి పైగా టూరిస్టులు న్యూయార్క్ ను సందర్శిస్తుంటారు. చాలామంది ట్రావెలర్స్ కు న్యూయార్క్ అనేది అమెరికాకు ఎంట్రీ పాయింట్ లాంటిది. అంటే వైరస్ తో ఎవరైనా అక్కడ అడుగుపెడితే, న్యూయార్క్ లోని ఇతరులకు సోకడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మార్చి 1 న న్యూయార్క్ లో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. అయితే దీనికి ముందే, ఫిబ్రవరిలోనే యూరప్ నుండి అక్కడ(న్యూయార్క్ లో) వ్యాప్తి చెందడం ప్రారంభమైనట్లు అమెరికన్ జన్యు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బిగ్ ఆపిల్ కూడా భారీ సామాజిక ఆర్థిక అసమానతతో ఉంటుంది.  న్యూయార్క్ సిటీకి బిగ్ యాపిల్ అని కూడా మరోపేరు ఉన్న విషయం తెలిసిందే.

రద్దీ ఎక్కువగా(Overcrowded), రద్దీ లేని ప్రాంతాలు(deprived areas) ప్రాంతాలు – ముఖ్యంగా బ్రోంక్స్ మరియు క్వీన్స్‌లో చాలా మంది ప్రజలు ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మరియు వైద్యసంరక్షణ కొరతతో అత్యధిక స్థాయిలో అంటువ్యాధులను ఎదుర్కొన్నారు. కరోనాతో న్యూయార్క్ లో  చాలా తీవ్రంగా దెబ్బతింటుందనే ఆలోచనకు మద్దతు ఇచ్చేలా న్యూయార్క్ సిటీ ముందస్తు షరతులను కలిగి ఉందని కొలంబియా యూనివర్శిటిలో పబ్లిక్ హెల్త్ ఫ్రొఫెసర్ మరియు విపత్తు సంసిద్ధతలో నిపుణుడైన ఇర్విన్ రెడ్లెనర్ అన్నారు.

ప్రమాదాన్ని అధికారులు తక్కువ అంచనా వేశారా?

మార్చ్-2న న్యూయార్క్ రాష్ట్రంలోని న్యూ రోచెల్లీలో రెండవ కరోనా కేసు నమోదైంది. న్యూ రోజెల్లీ.. న్యూయార్క్ సిటీకి ఉత్తరం వైపు ఉంటుంది. న్యూయార్క్ గవర్నర్ క్యూమో మాట్లాడుతూ..ఈ భూగ్రహంపైనే అత్యుత్తమ హెల్త్ కేర్ వ్యవస్థ ఇక్కడ ఉందన్నారు. ఇతర దేశాల్లో ఉన్న మాదిరిగా ఈ స్థాయిలో కరోనా ప్రభావం న్యూయార్క్ లో ఉంటుందని తాము అసలు ఆలోచన కూడా చేయలేదని ఆయన అన్నారు. చాలా రోజులు వెనుకాడిన తర్వాత న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ డీ బ్లాసియో ఎట్టకేలకు మార్చి-16 నుంచి రెస్టారెంట్లు,స్కూల్స్,బార్లను మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారం రోజులకి మార్చి-22న న్యూయార్క్ గవర్నర్…అన్ని నాన్ ఎసెన్షియల్ వ్యాపారాలను మూసివేయాలని,ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. వాళ్లు చాలాకాలం ఎదురుచూసారు అని చెప్పేందుకు నిపుణులు వెనుకాడారు.

రెండు ప్రత్యర్థి శక్తుల ద్వారా మేయర్ మరియు గవర్నర్ నెట్టేయబడి మరియు లాగబడి ఉన్నారు. ఒకటేమో, సాధ్యమైనంత త్వరగా మనం స్కూల్స్,రెస్టారెంట్లు మూసివేయాలని చెబితే,మరొకటి..అన్నింటిని షట్ డౌన్ చేయడం ద్వారా మనం తీవ్రమైన ఆర్థిక,సామాజిక పరిణామాలను ఎదుర్కోవాలని తెలిపినట్లు కొలంబియా యూనివర్శిటిలో పబ్లిక్ హెల్త్ ఫ్రొఫెసర్ ఇర్విన్ రెడ్లెనర్ తెలిపారు. ఫెడరల్ గవర్నమెంట్ నుంచి,అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ప్రతిఒక్కరూ మిక్స్ డ్(కలగలిపిన)మెసేజ్ లను పొందారని రెడ్లెనర్ తెలిపారు.

ఇతర రాష్ట్రాలు బెటర్ గా రియాక్ట్ అయ్యాయా?

అమెరికాలోనే ఎక్కువ జనాభా కలిగిన సిటీ కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలో 3.95కోట్ల మంది నివసిస్తున్నారు. అకస్మాత్ముగా వచ్చే వ్యాప్తికి వేగంగా స్పందించే సిటీగా కాలిఫోర్నియాను ఉదాహరణగా చెబుతుంటారు. ఇప్పటివరకు కాలిఫోర్నియాలో 23,397కరోనా కేసులు నమోదుకాగా,688మంది ప్రాణాలు కోల్పోయారు. మార్చి-16న శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ఆరు కౌంటీలు(పరిపాలన కోసం ఉపయోగించబడే ప్రాంతాన్నే కౌంటీ అంటారు) స్టే-ఎట్-హోమ్(ఇంట్లోనే ఉండండి)ఆర్డర్ జారీ చేశాయి. మూడు రోజుల తర్వాత ఆలస్యంగా అక్కడ రాష్ట్రమంతా స్టే-ఎట్-హోమ్ ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం యొక్క పబ్లిక్ హెల్త్ స్కూల్ అసోసియేట్ మేఘన్ మెక్ గింటి మాట్లాడుతూ…నేను ముఖ్యమైనదిగా భావించే ఒక విషయం ఏమిటంటే,6 పొరుగు కౌంటీలు కలిసికట్టుగా మొత్తం ఆరు కౌంటీలకు సేమ్(confinement)ఆర్డర్ జారీ చేసినట్లు, వాళ్లు చాలా తొందరగా ఈ ఆర్డర్ జారీ చేసినట్లు తెలిపారు. న్యూయార్క్ ఒకలా ఉండటానికి, వెస్ట్‌చెస్టర్ (కౌంటీ)లో పరిస్థితి మరోలా ఉండటానికి తీసుకోవటానికి మరియు లాంగ్ ఐలాండ్ లో మరోలా ఉండటానికి విరుద్ధంగా ఉందని చెప్పే దానికి స్థిరత్వం ఉందని ఆమె తెలిపారు. న్యూయార్క్ లో స్కూల్స్ మూసివేయడానికి జారీ చేసిన ఆర్డర్ మరియు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని జారీ చేసిన ఆర్డర్ కి మధ్య ఆరు రోజులు గడిచాయని ఆమె తెలిపారు. కరోనా లాంటి మహమ్మారి విషయంలో…ఆరు రోజులు అనేది చాలా పెద్ద విషయమని,ఇది వైరస్ వ్యాప్తి నివారణలో,కంట్రోల్ లో చాలా వ్యాత్సాసం చూపిస్తుందని ఆమె తెలిపారు. న్యూయార్క్ చాలాకాలం ఎదురుచూసిందని ఖచ్చితంగా చెప్పవచ్చని మెక్ గింటీ తెలిపారు.

ఎవరినైనా నిందించాలా?

సంక్షోభం దాటిపోనప్పుడు, నిందించే ఆట ప్రారంభమవుతుంది. ట్రంప్ పరిపాలన…రాష్ట్రాలకు పరీక్షలు పొందడంలో ఆలస్యం చేసినట్లు, డెమొక్రాట్లు అయిన న్యూయార్క్ గవర్నర్ క్యూమో మరియు న్యూయార్క్ మేయర్ డి బ్లాసియో వారాలపాటు ఆలస్యం చేశారు. ఈ రోజు వరకు అవి న్యూయార్క్ లో తగినంత సంఖ్యలో రావడం లేదు. అంతేకాకుండా న్యూయార్క్ అధికారులు ప్రాణాలను రక్షించే వెంటిలేటర్లను తయారు చేయడానికి ఎమర్జెన్సీ పవర్స్ ను(అత్యవసర అధికారాలు) అమలు చేయడంలో తమను అడ్డుకున్నారంటూ ఫెడరల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read | తల్లేనా, భర్త మీద కోపంతో ఐదుగురు పిల్లలను గంగలోకి తోసేసింది