Extinct Fish Species That Existed Over 420 Million Years Ago Found Alive In The Indian Ocean
Extinct Fish Species : కొన్ని వందల మిలియన్ల ఏళ్ల క్రితం భూమిపై డైనోసర్ వంటి ఎన్నో జాతులు నివసించాయి. కాలక్రమేణా ఆ జాతులన్నీ అంతరించిపోయాయి. కానీ, ఇప్పటికీ కొన్ని అరుదైన జాతులు సజీవంగానే ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. దాదాపు 420 మిలియన్ల ఏళ్ల క్రితమే డైనోసార్లతో అంతరించిపోయినట్టు భావిస్తున్న అరుదైన చేప జాతి ఒకటి ఇటీవల హిందూ మహాసముద్రంలో సజీవంగానే ఉందని కనుగొన్నారు. అమెరికాకు చెందిన మొంగాబే నివేదిక ప్రకారం.. దక్షిణాఫ్రికా సొరచేప వేటగాళ్ల బృందం ఇటీవల పశ్చిమ హిందూ మహాసముద్రంలోని మడగాస్కర్ తీరంలో అరుదైన కోయిలకాంత్ జాతులను (Latimeria chalumnae) కనుగొంది.
ఈ కోయిలకాంత్ జాతిని ‘నాలుగు కాళ్ల శిలాజ చేప’ అని కూడా పిలుస్తారు. ఇది 420 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదిగా కనుగొన్నారు. మొంగాబే నివేదిక ప్రకారం.. ఈ జాతి 100 నుండి 500 మీటర్ల మధ్య లోతులో సముద్రగర్భ లోయలలో నివసిస్తుంది. వీటి బరువు 90 కిలోగ్రాముల బరువు ఉంటుంది. కోయిలకాంత్ మొట్టమొదటి పున:సృష్టి 1938లో మడగాస్కర్ నైరుతి తీరంలో గిల్-నెట్స్ ఏర్పాటు చేసిన సముద్ర మత్స్యకారుల బృందం తిరిగి తయారు చేసింది. అప్పుడు జాతుల ఆవిష్కరణతో శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు.
అప్పటి నుచి దక్షిణాఫ్రికా, టాంజానియా, కొమొరోస్ ద్వీపాల తీరప్రాంతాల్లోని మత్స్యకారులకు కోయిలకాంత్ జాతి చేపలు తారసపడినట్టు నివేదికలు ఉన్నాయి.ఇండోనేషియా జలాల్లో వేరే కోయిలకాంత్ జాతులు వచ్చాయని మొంగాబే నివేదిక పేర్కొంది. ఈ జాతి ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నట్లు నివేదిక గుర్తించింది. ఎస్‌ఐ జర్నల్ ఆఫ్ సైన్స్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం.. మే 2020 నాటికి, కోయిలకాంత్ జాతుల గురించి కనీసం 334 నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మడగాస్కర్‌లో కోయిలకాంత్ చేప జాతులను పర్యవేక్షించడంతో పాటు పరిరక్షించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
షార్క్‌లను వేటాడం కారణంగా కోయిలకాంత్ జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని అధ్యయనం చెబుతోంది. షార్క్ చేపలను పట్టుకోవటానికి ఉపయోగించే జరీఫా గిల్-నెట్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. పెద్ద మెష్ జరీఫా గిల్-నెట్స్ ఇప్పుడు మడగాస్కర్‌లో కోయిలకాంత్స్ మనుగడకు అతిపెద్ద ముప్పుగా మారాయని అంటున్నారు.