Facing egg shortage
US Egg Crisis : అమెరికాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా కోడిగుడ్ల ధరలు అకాశాన్ని అంటుతున్నాయి. కోడిగుడ్ల కొరత కారణంగా రోజురోజుకీ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. కోడిగుడ్ల కొరత ఏర్పడటంతో వాటి సరఫరాకు తీవ్ర అడ్డంకిగా మారింది. దాంతో చేసేది ఏమిలేక అక్కడి వారంతా తమ ఇంట్లో కోళ్లను పెంచడం ప్రారంభించారని ఒక నివేదిక పేర్కొంది. గత జనవరిలో గుడ్ల ధరలు 15 శాతానికి పైగా పెరిగాయి. 2015 తర్వాత అతిపెద్ద పెరుగుదల ఇదే.
Read Also : PM Kisan : ఈ నెల 24న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. రూ. 2వేలు పడ్డాయో లేదో తెలుసుకోవడం ఎలా?
గత ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే.. 55 శాతం కోడిగుడ్ల పెరుగుదల కనిపించిందని యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నివేదికను ఉటంకిస్తూ ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. గుడ్ల ధరలలో ఈ భారీ పెరుగుదల ఆగస్టు 2023 తర్వాత దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం రేటుకు దోహదపడింది.
దాంతో చాలా మంది అమెరికన్లు ఇంట్లో కోళ్లను పెంచడం ద్వారా ఈ కొరతను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారని నివేదిక తెలిపింది. ఇప్పటికే పలు స్టోర్లలో ‘లిమిటెడ్ స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల అయితే ‘నో ఎగ్స్’ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. కోడిగుడ్ల విక్రయంపై స్టోర్లు ఒక్కరికి రెండు, 3 ట్రేలు మాత్రమే అందిస్తున్నాయి.
హూస్టన్‌లో పెరిగిన చికెన్ అమ్మకాలు :
నివేదిక ప్రకారం.. పౌల్ట్రీ అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా హ్యూస్టన్‌లో, స్థానిక సరఫరాదారులకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. “మా కోళ్ల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. బహుశా మూడు రెట్లు పెరిగాయి” అని జాన్ బెర్రీ అనే వ్యాపారి చెప్పారు. వారానికి 100 లేదా అంతకంటే ఎక్కువ కోళ్లను అమ్ముతున్నామని తెలిపారు. గుడ్డు కొరతకు ముందు, అంత కోళ్లను అమ్మడానికి రెండు నుంచి మూడు వారాలు పట్టేదని చెప్పుకొచ్చారు.
రెండు కోట్లకు పైగా కోళ్లు చంపడంతో ప్రభావం :
దేశవ్యాప్తంగా ఉన్న కోళ్ల ఫామ్‌లను బర్డ్ ఫ్లూ వ్యాప్తి తాకింది. ఫలితంగా 2024లో 21 మిలియన్లకు పైగా గుడ్లు పెట్టే కోళ్లు చంపారు. ఇంత పెద్ద సంఖ్యలో కోళ్లను చంపడం వల్ల గుడ్ల లభ్యతపై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఇప్పుడు విలువైన వస్తువుగా మారాయి. యూఎస్ సూపర్ మార్కెట్లలో ప్రీమియం గుడ్ల ధర ఇప్పుడు డజనుకు 10 డాలర్ల వరకు ఉంది. అయితే, తక్కువ-గ్రేడ్ గుడ్ల ధర కూడా సాధారణ 2 డాలర్ల నుంచి 3 డాలర్లకు రెట్టింపు అయింది. కోడిగుడ్ల ధరల పెరుగుదల వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేసింది. ట్రేడర్ జోస్, కాస్ట్కో వంటి ప్రముఖ కిరాణా స్టోర్లలో గుడ్డు కొనుగోళ్లను పరిమితం చేయడం ప్రారంభించాయి. వాఫిల్ హౌస్ వంటకాలకు గుడ్డుకు 50 శాతం సర్‌ఛార్జ్‌ను చేర్చింది.
అమెరికన్ లేబర్ బ్యూరో ప్రకారం.. 2024 జనవరిలో ఒక డజను కోడిగుడ్ల ధర 2.52డాలర్లు అయితే డిసెంబర్ నాటికి 4.15 డాలర్లకు పెరిగింది. కానీ, ఇప్పుడు 7.34 డాలర్లుకు చేరుకుంది. రాబోయే రోజుల్లో కోడిగుడ్ల ధరలు మరింత ప్రియమయ్యే పరిస్థితి కనిపించనుందని అంచనా.
ఇంట్లో కోళ్ల పెంపకంపై స్థానికుడి స్పందన :
ఆర్టురో బెకెర్రా అనే వ్యక్తి ఇటీవల 10 కోళ్లను 400 డాలర్లకు కొన్నానని చెప్పాడు. “ఇప్పుడు వాటిని ఉంచడానికి నా దగ్గర కొంత స్థలం ఉంది. గుడ్లు చాలా ఖరీదైనవి” అని చెప్పాడు. “కోళ్లను కొని పెంచడం చౌకగా ఉంటుందని నేను భావిస్తున్నాను.” బెకెర్రా తన కస్టమర్లలో ఎక్కువ మంది కోళ్ల పెంపకానికి కొత్తవారని కనుగొన్నాడు.
“ఇంట్లో కోళ్లను పెంచడం వల్ల దుకాణంలో అధిక ధర చెల్లించకుండానే తాజా గుడ్లు లభిస్తాయని అక్కడి వారు భావిస్తున్నారని” బెకెర్రా పేర్కొన్నారు. అంచనా ప్రకారం.. వెయ్యి లేదా ఒక మిలియన్ అదనపు కోళ్లను పెంచాలని బెకెర్రా తెలిపాడు. అయితే, బర్డ్ ఫ్లూ కారణంగా కొన్ని గుడ్లు పెట్టే చంపేడయంతో వాటి స్థానంలో కొత్త కోళ్ల సంఖ్యను తిరిగి పొందడానికి చాలా సమయం పడుతుందని నిపుణులు హెచ్చరించారు.
ఏవియన్ ఫ్లూ ప్రమాదంపై సీడీసీ వివరణ :
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) పౌల్ట్రీ రైతులకు మార్గదర్శకాలను జారీ చేసింది. సాధారణ ప్రజలకు ఏవియన్ ఫ్లూ ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ, సోకిన జంతువులతో ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చే వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని అప్రమత్తం చేస్తోంది.