PM Kisan : ఈ నెల 24న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. రూ. 2వేలు పడ్డాయో లేదో తెలుసుకోవడం ఎలా?

PM Kisan : ఈ నెల (ఫిబ్రవరి 24)వ తేదీన పీఎం కిసాన్ 19వ విడత పెట్టుబడి సాయం విడుదల చేయనుంది. మోదీ ఫిబ్రవరి 24వ తేదీన బిహార్‌లో పర్యటించనున్నారు. రూ. 2వేలు చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేసే అవకాశం ఉంది.

PM Kisan : ఈ నెల 24న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. రూ. 2వేలు పడ్డాయో లేదో తెలుసుకోవడం ఎలా?

PM Kisan Yojana 19th installment

Updated On : February 13, 2025 / 3:55 PM IST

PM Kisan Yojana 19th installment : పీఎం కిసాన్ రైతు లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (Pradhan Mantri Kisan Samman Nidhi) 19వ విడత నిధులకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ నెల (ఫిబ్రవరి 24)వ తేదీన పీఎం కిసాన్ 19వ విడత పెట్టుబడి సాయం విడుదల చేయనుంది. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఒక ప్రకటన చేసినట్టుగా మీడియా నివేదికలు వెల్లడించాయి.

షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24వ తేదీన బిహార్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అనేక వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. పలు రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ రైతుల డబ్బులను రూ. 2వేలు చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేసే అవకాశం ఉంది.

Read Also : PM Kisan : పీఎం కిసాన్‌ డబ్బులు పడే తేదీ ఇదేనట.. స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.. కొత్తగా రైతులు అప్లయ్ చేసుకోవాలంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) సిస్టమ్ ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా నిధులను బదిలీ చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) యోజన కింద రైతులు సంవత్సరానికి రూ. 6వేలు చొప్పున మూడు సమాన వాయిదాలలో అందుకుంటారు.

లబ్ధిదారులు అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in)లో పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో వారి పేమెంట్ స్టేటస్ కూడా చేయవచ్చు. అందులోనే పీఎం కిసాన్ లబ్ధిదారుల పేర్లను కూడా ధృవీకరించవచ్చు. పీఎం కిసాన్ డబ్బులను పొందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి.

పీఎం కిసాన్ 19వ వాయిదా తేదీ, వివరాలు :

వాయిదా మొత్తం : రూ. 2వేలు
మొత్తం వార్షిక సాయం : రూ. 6వేలు
విడుదల తేదీ: ఫిబ్రవరి 24, 2025
పంపిణీ విధానం : ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా డబ్బులు పంపిణీ

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా ఎలా చెక్ చేయాలి? :

రైతులు ఈ కింది దశల ద్వారా వారి పేమెంట్ స్టేటస్, లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు.

  • అధికారిక (PM-Kisan) పోర్టల్‌ (pmkisan.gov.in)ను విజిట్ చేయండి.
  • “Beneficiary Status”పై క్లిక్ చేయండి.
  • మీ సరైన ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • ఆ తరువాత, మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసేందుకు “Get Data” పై క్లిక్ చేయండి.
  • ఒకవేళ రైతు పేరు జాబితాలో లేకుంటే.. సహాయం కోసం స్థానిక అధికారులను సంప్రదించాలి.

పీఎం కిసాన్ ఈ-కేవైసీ ప్రక్రియ ఇలా :

పీఎం కిసాన్ డబ్బులను పొందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా (e-KYC) ప్రక్రియను పూర్తి చేయండి. సరైన లబ్ధిదారులకు నిధులు చేరేలా మోసాలను నిరోధించేలా చూడటానికి ప్రభుత్వం e-KYCని తప్పనిసరి చేసింది. రైతులు మూడు పద్ధతుల్లో e-KYCని పూర్తి చేయవచ్చు.

Read Also : RBI New 50 Note : కొత్త రూ.50 నోట్లు వస్తున్నాయి.. అతి త్వరలోనే మార్కెట్లోకి.. పాత నోట్ల సంగతేంటి?

  • OTP-ఆధారిత e-KYC (ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్ ద్వారా)
  • ఫేస్ అథెంటికేషన్ ఆధారిత e-KYC పద్ధతి ద్వారా
  • బయోమెట్రిక్ ఆధారిత e-KYC (సాధారణ సేవా కేంద్రాలలో)

పీఎం-కిసాన్ స్కీమ్ 2019 గురించి :

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) కార్యక్రమాలలో ఒకటి. 2019లో ఈ పీఎం కిసాన్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభం నుంచే భారత్ అంతటా లక్షలాది మంది రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతుగా ప్రత్యక్ష ఆర్థిక సహాయం పొందారు. రైతులు పీఎం కిసాన్ పోర్టల్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలి. ప్రయోజనాలను పొందాలంటే అవసరమైన వెరిఫికేషన్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.