PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు పడే తేదీ ఇదేనట.. స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.. కొత్తగా రైతులు అప్లయ్ చేసుకోవాలంటే?
PM Kisan's 19th Installment : 18వ విడతను భారత ప్రభుత్వం అక్టోబర్ 05, 2024న విడుదల చేసింది. లబ్ధిదారులు ఇప్పుడు పీఎం కిసాన్ 19వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

PM Kisan's 19th Installment
PM Kisan’s 19th Installment : దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్ డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు 18వ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లలో క్రెడిట్ చేసింది. అతి త్వరలో 19వి విడత పీఎం కిసాన్ రానుంది.
ఈసారి పీఎం కిసాన్ విడత డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) భారత్‌లోని చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించిన ఒక కీలక కార్యక్రమం.
అర్హత కలిగిన రైతులు సంవత్సరానికి రూ. 6వేలు చొప్పున మూడు సమాన వాయిదాలలో రూ. 2వేలు అందుకుంటారు. ఒక ఆర్థిక సంవత్సరానికి వారి బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమ అవుతుంది. భూమిని కలిగి ఉన్న రైతులకు ఆర్థికంగా సాయం చేసేందుకు ఈ స్కీమ్ ఫిబ్రవరి 24, 2019న ప్రారంభమైంది. పీఎం కిసాన్ 18వ విడతను భారత ప్రభుత్వం అక్టోబర్ 05, 2024న విడుదల చేసింది. లబ్ధిదారులు ఇప్పుడు పథకం కింద 19వ విడత కోసం ఎదురు చూస్తున్నారు.
పీఎం కిసాన్ 19వ వాయిదా తేదీ (అంచనా) :
19వ విడత ఫిబ్రవరి 2025 చివరి వారంలో పంపిణీ చేస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇంకా కచ్చితమైన తేదీని నిర్ధారించనప్పటికీ, పీఎం కిసాన్ చెల్లింపులు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం డబ్బులు అకౌంట్లలో జమ అవుతుంటాయి.
2025 ఫిబ్రవరి చివరి నాటికి 19వ విడత లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధృవీకరించినట్లు తెలుస్తోంది. గత 18వ విడత అక్టోబర్ 5, 2024న విడుదలైన సంగతి తెలిసిందే.
పీఎం కిసాన్ ఆన్‌లైన్‌లో స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
- రైతు లబ్ధిదారులు తమ పీఎం కిసాన్ అకౌంట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేయొచ్చు.
- అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను (https://pmkisan.gov.in) విజిట్ చేయండి.
- ‘Beneficiary Status‘ సెక్షన్‌కు వెళ్లండి: హోమ్‌పేజీలోని ‘Beneficiary Status‘ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- మీ వివరాలను ఎంటర్ చేయండి : మీ ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను అందించండి.
- స్టేటస్ చెక్ చేయండి : పూర్తి వివరాలను సమర్పించిన తర్వాత, మీ వాయిదా స్టేటస్ తెలుసుకోవచ్చు.
పీఎం కిసాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? :
- కొత్త రైతులు పీఎం కిసాన్ కోసం ఆన్‌లైన్‌లో లేదా కామన్ సర్వీస్ సెంటర్ల (CSCs) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- ‘New Farmer Registration‘ పై క్లిక్ చేయండి.
- ఆధార్ నంబర్, రాష్ట్రం, జిల్లా, వ్యక్తిగత/బ్యాంక్ సమాచారం వంటి అవసరమైన వివరాలను నింపండి.
- ఫారమ్‌ను సమర్పించి, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఒక కాపీని సేవ్ చేసుకోండి.
- దరఖాస్తును సమర్పించిన తర్వాత, ఆమోదం పొందే ముందు స్థానిక అధికారులు ధృవీకరిస్తారు.
‘పీఎం కిసాన్’కి మొబైల్ నంబర్ లింక్ చేయడం ఎలా? :
- అప్‌డేట్స్, వాయిదా నోటిఫికేషన్‌లను స్వీకరించడానికి మీ మొబైల్ నంబర్‌ను పీఎం కిసాన్ పోర్టల్‌కు లింక్ చేయడం చాలా ముఖ్యం.
- OTP- ఆధారిత eKYC పూర్తి చేసేందుకు కూడా ఈ దశ అవసరం.
- మీ నంబర్‌ను లింక్ చేసేందుకు ఇలా చేయండి.
- మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించండి లేదా పీఎం కిసాన్ వెబ్‌సైట్ (https://pmkisan.gov.in)లోకి లాగిన్ అవ్వండి.
- ‘Update Mobile Number‘ ఆప్షన్ ఎంచుకోండి.
- మీ రిజిస్టర్డ్ ఆధార్ నంబర్, కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- వెరిఫికేషన్ కోసం రిక్వెస్ట్ సమర్పించండి.