iQOO Neo 10R Price : ఐక్యూ నియో 10R ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
iQOO Neo 10R Price : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకోసం అతి త్వరలో భారత మార్కెట్లోకి ఐక్యూ నియో 10ఆర్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కు ముందే ధర వివరాలు లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

iQOO Neo 10R price leaked
iQOO Neo 10R Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఐక్యూ బ్రాండ్ నుంచి మరో సరికొత్త ఫోన్ రాబోతుంది. అయితే, ఈ ఫోన్ ఇంకా లాంచ్ కానే కాలేదు.. ముందుగానే ఐక్యూ నియో 10ఆర్ ధర వివరాలు లీక్ అయ్యాయి.
ఇటీవల ఫ్లాగ్‌షిప్ ఐక్యూ 13 ఫోన్ లాంచ్ చేసిన తర్వాత కంపెనీ మిడ్-రేంజర్ ఐక్యూ నియో 10R ఫోన్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 11న భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. లాంచ్‌కు ముందే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఏయే ఫీచర్లు ఉండనున్నాయో కంపెనీ టీజ్ చేస్తోంది. ఆన్‌లైన్‌లో వస్తున్న పుకార్లు, లీక్‌లు కూడా ఇదే చెబుతున్నాయి.
Read Also : Google Pixel 9 : ఆఫర్ భలే ఉంది భయ్యా.. ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్‌పై ఏకంగా రూ.9వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!
అధికారిక లాంచ్‌కు ముందే ఈ ఐక్యూ నియో స్మార్ట్‌ఫోన్ ధరలను కొత్త లీక్ వెల్లడించింది. ఇటీవలి లీక్‌లను విశ్విస్తే.. ఐక్యూ నియో 10R ఫోన్ ధర రూ. 30వేల కన్నా తక్కువ కేటగిరీలో ఉంటుందని భావిస్తున్నారు. కచ్చితమైన ధర వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, లీక్‌ల ప్రకారం.. బేస్ వేరియంట్ దాదాపు రూ. 28,999 నుంచి ప్రారంభమవుతుందని సూచిస్తున్నాయి. ఇటీవల లాంచ్ అయిన పోకో X7 ప్రో, రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్లు కూడా ఇదే ధరలో అందుబాటులో ఉన్నాయి.
ఐక్యూ నియో 10ఆర్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఈ ఫోన్ కొత్త మూన్‌నైట్ టైటానియం కలర్ వేరియంట్‌లో రావచ్చు. ర్యాగింగ్ బ్లూ కలర్‌వేతో పాటు ఆకర్షణీయమైన మెటాలిక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. ఐక్యూ నియో 10R ఫోన్ 144Hz వరకు రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో 6.78-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. హై పర్ఫార్మెన్స్ కోసం రూపొందించిన 4nm ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.
గరిష్టంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐక్యూ నియో 10Rలో సోనీ LYT-600 సెన్సార్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఐక్యూ నియో 10R 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,400mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి.
ఐక్యూ నియో 10R ఫుల్ స్పెసిఫికేషన్స్ (అంచనా) :
- 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే
- 2800 x 1260px రిజల్యూషన్
- 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
- క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్
- ఆండ్రాయిడ్ 15OS ఆపరేటింగ్ సిస్టమ్
- 8GB ర్యామ్ + 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB ర్యామ్ + 512GB ఇంటర్నల్ స్టోరేజ్
- బ్యాక్ సైడ్ 50MP సోనీ మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, డ్యూయల్ కెమెరా సెటప్
- ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా
- బాటమ్ డిస్‌ప్లేలో ఫింగర్‌ప్రింట్ స్కానర్
- 5G నెట్‌వర్క్ సపోర్ట్
- ఐపీ69 వాటర్, డస్ట్ రెసిస్టన్స్
- USB టైప్-C పోర్ట్
- 6400mAh బ్యాటరీ