precious gift for father : తండ్రికి కొడుకు ఇచ్చిన విలువైన బహుమతి .. చూడగానే ఆ తండ్రి కన్నీరు ఆగలేదు..

తల్లిదండ్రులకు ఏమిచ్చిన రుణం తీరదు. కానీ వారి ఇష్టాలను తీర్చే అవకాశం వస్తే? ఓ కొడుకు తన తండ్రికి ఎంతో అమూల్యమైన బహుమతి ఇచ్చాడు. అది చూసిన ఆ తండ్రి కన్నీరు ఆగలేదు.

precious gift for father : బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. అందుకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వృద్ధిలోకి వచ్చిన బిడ్డలు తమ ఇష్టాల్ని నెరవేరిస్తే.. ఇక ఆ తల్లిదండ్రుల ఆనందం మాటల్లో చెప్పలేం. తండ్రికి ఊహించని బహుమతి ఇచ్చాడు ఓ కొడుకు. అది చూసిన తరువాత తండ్రి పరిస్థితి ఏంటో చదవండి.

Valentine Day 2023 : ‘గుండెను బంగారు గులాబీలు’గా మార్చి భర్తకు బహుమతి..

ఫెర్నాండెజ్ (fernandez) అనే కుర్రాడు తన తండ్రికి అరుదైన బహుమతి ఇచ్చాడు. బహుమతి గురించి చెప్పే ముందు అతని తండ్రి గురించి చెప్పాలి. 40 సంవత్సరాల క్రితం యుద్ధం జరుగుతున్న సమయంలో ఎల్ సాల్వడార్‌ (El Salvador) నుంచి ఆస్ట్రేలియాకు (Australia) వచ్చింది ఫెర్నాండెజ్ కుటుంబం. అతని తండ్రికి అప్పుడు 25 సంవత్సరాలు. ఆస్ట్రేలియాలో స్థిరపడటానికి ఎంతో కష్టపడింది వారి కుటుంబం. అతని తండ్రి ఎంతో ఇష్టమైన తన దేశాన్ని మర్చిపోవాల్సి వచ్చింది. తిరిగి వెళ్లడానికి కూడా స్థోమత లేని పరిస్థితుల్లో ఇంచుమించుగా తన దేశాన్ని మర్చిపోయాడతను. ఇప్పుడు ఫెర్నాండెజ్ కు 27 సంవత్సరాలు. కొన్నేళ్లుగా తమ కుటుంబాన్ని పోషించడానికి తండ్రి పడ్డ కష్టాన్ని కళ్లారా చూసాడు ఫెర్నాండెజ్. తన దేశమంటే తండ్రికి ఎంత ఇష్టమో కూడా తెలుసుకున్నాడు. అందుకే తండ్రి తన స్వదేశానికి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు కొని ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. మూడు దశాబ్దాలుగా తన స్వదేశాన్ని చూడలేకపోయిన ఆ తండ్రి ఆనందం ఇంక ఎలా ఉంటుంది చెప్పండి. తన బిడ్డ ఇచ్చిన బహుమతికి కళ్లు చమ్మగిల్లి కొడుకును దగ్గరగా హత్తుకున్నాడు. ఈ సందర్భంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pet Dog Birthday Party : పెంపుడు కుక్క బ‌ర్త్‌డే..రూ .4500 డ్రెస్ .. బంగారు గొలుసులు బహుమతి

ఈ వీడియో చూసినవారంతా ఎమోషనల్ గా స్పందిస్తున్నారు. వీడియో చూస్తుంటే కన్నీరు ఆగలేదని.. తన దేశాన్ని తల్చుకుని మౌనంగా ఆ తండ్రి అనుభవించిన బాధను ఊహించగలమని అభిప్రాయాలు పెడుతున్నారు. కొడుకు ఇచ్చిన బహుమతితో మూడు దశాబ్దాల తర్వాత తను పుట్టిన నేలపై అడుగుపెట్టబోతున్న ఫెర్నాండెజ్ తండ్రి ఆనందాన్ని మాటల్లో చెప్పగలమా?

ట్రెండింగ్ వార్తలు