Trump: ‘ట్రంప్‌ని చంపేస్తా’.. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ సంచలన పోస్ట్..

జేమ్స్ కామీ పోస్టుపై ఎఫ్‌బీఐ ప్రస్తుత డైరెక్టర్, భారత సంతతికి చెందిన కాష్ పటేల్ స్పందించారు..

Donald Trump

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపేస్తామంటూ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, అతని చర్యలపై అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.

 

జేమ్స్ కామీ 2013-17 సంవత్సరాల మధ్య ఎఫ్ బీఐ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇటీవల ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు చేశాడు. సముద్రపు షెల్స్ చిత్రాన్ని ఉంచి ‘86 47’ అనే పదాలను పోస్టు చేశాడు. ఆ పోస్టుకు ‘నా బీచ్ వాక్ లో కూల్ షెల్ నిర్మాణం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. కొద్దిసేపటి తరువాత ఆ పోస్టును డిలీట్ చేశాడు. అయితే, జేమ్స్ కామీ పెట్టిన పోస్టు 47వ అధ్యక్షుడిని చంపడం అనే అర్థం వచ్చేలా ఆ రహస్య కోడ్ ఉందని, అతడి చర్యపై అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ వెల్లడించారు. ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడు కావడం, 86 అనే సంఖ్య వదిలించడం లేదా చంపడంతో కూడా ముడిపడి ఉండటంతో దర్యాప్తు సంస్థలు ఆ పోస్టుపై దృష్టిసారించాయి.

 

పోస్టు డిలీట్ చేయడంపై జేమ్స్ కామీ వివరణ ఇచ్చాడు. ‘తాను బీచ్ వాక్ చేస్తున్న సమయంలో చూసిన సెల్ ల చిత్రాన్ని పోస్టు చేశానని, ఆ పోస్టును అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని పే్ర్కొన్నాడు. ఆ నంబర్లను కొందరు హత్యలు చేసేందుకు వాడుతారనే విషయం నాకు తెలియదని చెప్పారు. అమెరికా అధ్యక్షుడిని చంపాలనే ఉద్దేశం తనకు ఎఫ్పుడూ లేదని, హింస అంటేనే తనకు నచ్చదని, ఆ పోస్టు వల్ల తనపై ఆరోపణలు వస్తుండటంతో దానిని డిలీట్ చేశానని జేమ్స్ కామీ చెప్పుకొచ్చాడు.

 

ఎఫ్‌బీఐ ప్రస్తుత డైరెక్టర్, భారత సంతతికి చెందిన కాష్ పటేల్ సోషల్ మీడియా వేదికగా జేమ్స్ కామీ పోస్టుపై స్పందించారు.  కామీ సోషల్ మీడియా పోస్టు గురించి ఎఫ్‌బీఐకి తెలుసునని పేర్కొంటూ.. ‘‘ అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ గురించి మాకు తెలుసు. మేము సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కుర్రాన్ తో కమ్యూనికేషన్ లో ఉన్నాము. ఈ విషయాలపై ప్రాథమిక అధికారిక పరిధి ఎస్ఎస్ వద్ద ఉంది. మేము, ఎఫ్‌బీఐ అవసరమైన అన్ని మద్దతులను అందిస్తాము’’ అని వెల్లడించారు.


Also Read: Gold Rate Today: అరెరే.. మళ్లీ ఏమైంది..! భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఇలా..

Also Read: Ration Card: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. కొత్త రేషన్ కార్డుకోసం అప్లయ్ చేసుకున్నారా..? మీ దరఖాస్తు ఏ దశలో ఉందో ఇలా తెలుసుకోండి..