Ration Card: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. కొత్త రేషన్ కార్డుకోసం అప్లయ్ చేసుకున్నారా..? మీ దరఖాస్తు ఏ దశలో ఉందో ఇలా తెలుసుకోండి..
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత మీ దరఖాస్తు ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల..

Andhrapradesh
Ration Card: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మే 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రేషన్ కార్డు కావాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించి, తగిన వివరాలు అందించి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాక.. మే 15వ తేదీ నుంచి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డు కోసం దరఖాస్తు, మార్పులు చేర్పులకు సంబంధించిన సేవలను అందుబాటులోకి తెచ్చింది కూటమి ప్రభుత్వం.
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుతో పాటుగా ఇప్పటికే కార్డు ఉన్నవారికి స్పిల్టింగ్ కు కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొత్తగా పెళ్లైన జంటలు, ఇప్పటికే ఒక కుటుంబంలో ఉంటూ వేరే కాపురం వెళ్లిన వారితోపాటు ప్రస్తుతం ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డులు, వివిధ మార్పులు చేర్పులకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్నారు. అయితే, వీరు దరఖాస్తు చేసుకున్న తరువాత ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది.
మూడు దశల్లో ప్రక్రియ పూర్తి కావడానికి 21రోజుల సమయం పడుతుంది. ఈ సమయంలో మీరు చేసుకున్న దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏపీ సేవ అధికారిక పోర్టల్ లోకి వెళ్లి మీ దరఖాస్తు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
ఇలా చెక్ చేసుకోండి.
♦ https://vswsonline.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఏపీ సేవ అధికారిక పోర్టల్ ఓపెన్ అవుతుంది.
♦ పోర్టల్ లో కుడివైపు పైభాగంలో సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే సర్చ్ గడియ ఉంటుంది.
♦ అందులో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న సమయంలో వచ్చిన సంఖ్య నమోదు చేయాలి.
♦ క్యాప్చా కోడ్ వస్తుంది. ఆ వివరాలు అందులో నమోదు చేయాలి.
♦ రేషన్ కార్డు దరఖాస్తు ఏ అధికారి వద్ద ఉందో తెలిసిపోతుంది.
♦ అంతేకాదు.. ఎన్నిరోజుల్లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుంది వంటి వివరాలు కనిపిస్తాయి.
* @ncbn @PawanKalyan #inclusivity #RiceCard #TransRights pic.twitter.com/5OVJ51ER6W
— Manohar Nadendla (@mnadendla) May 15, 2025