Gold Rate Today: అరెరే.. మళ్లీ ఏమైంది..! భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఇలా..
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ..

Gold
Gold Rate Today: అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న రాజకీయ, దేశాల మధ్య ఉద్రిక్తత పరిణామాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇదేక్రమంలో గురువారం గోల్డ్ రేటు భారీగా తగ్గగా.. శుక్రవారం మళ్లీ పెరిగింది. వాస్తవానికి భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు. చైనా మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో బంగారం సరఫరాలో ఎక్కువ భాగం దిగుమతి అవుతుంది. బంగారం ప్రధానంగా యూఎస్ డాలర్లలో వ్యాపారం జరుగుతుంది. డాలర్ విలువలో హెచ్చుతగ్గులు భారతదేశంలోని బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. దీంతోపాటు, అధిక దిగుమతి సుంకాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా మన దేశంలో కొనుగోలుదారులకు రిటైల్ ధరలు పెరుగుతాయి.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1,200 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై 1,100 పెరిగింది. వెండి రేటు స్థిరంగా కొనసాగుతుంది. అయితే, అంతర్జాతీయంగా గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. బంగారం ఔన్సు (31.10గ్రాముల) ఐదు డాలర్లు తగ్గి 3,219 డాలర్లకు చేరుకుంది. ఔన్స్ సిల్వర్ రేటు 32.41 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.87,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,130 వద్దకు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,350 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,280కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 87,200 కాగా.. 24క్యారెట్ల ధర రూ.95,130కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.96,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,08,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.