యూఏఎఫ్ డెసిషన్ : ఫిబ్రవరి 14 లవర్స్ డే కాదు ‘సిస్టర్స్’ డే!!

పాక్ యూనివర్శిటీ సంచలన నిర్ణయం
ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం
కాదు కాదు సిస్టర్స్ డే
ఇస్లాం సంప్రదాయాలు కాపాడేందుకు
మహిళలకు స్కార్ఫ్‌ల పంపిణీ
అక్కాచెల్లెళ్లకు డ్రసెస్ గిఫ్ట్
పాకిస్థాన్ : ఫిబ్రవరి 14 స్పెషల్ ఏమిటీ అంటే నేటి యువత ఠక్కున చెప్పేస్తారు. అది ప్రేమికుల దినోత్సవం (వాలంటైన్స్ డే)అని. కానీ పాకిస్థాన్ లోని ఓ యూనివర్శిటీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14 లవర్స్ డే కాదు..సిస్టర్స్ డే గా జరుపుకోవాలని పాకిస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్, ఫైసలాబాద్ (యూఏఎఫ్) నిర్ణయించింది. యువతలో సంస్కృతి, ఇస్లాం సంప్రదాయాలను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ జాఫర్ ఇక్బాల్ రణ్‌ధవా తెలిపారు. ఇస్లాం సంప్రదాయాలంటే మన దేశ మహిళలు చాలా చాలా గౌరవిస్తారనీ..అక్కచెల్లెళ్లుగా..అమ్మలుగా, భార్యలుగా ఇస్లాం మహిళలు గౌరవించబడుతున్నారన్నారు. కానీ నేటి యువత సంప్రదాయాలను మరిచిపోతున్నారనీ..నిర్లక్ష్యం చేసి మోడ్రన్ లైఫ్ కు అలవాటు పడుతున్నారనీ జాఫర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే యువతలో సంప్రదాయాలను పెంచాలని ఈ నిర్ణయం తీసుకున్నామనీ..ఫిబ్రవరి 14న మహిళలకు స్కార్ఫ్‌లు, అక్కాచెల్లెళ్లకు దుస్తులు బహూకరించాలని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ జాఫర్ ఇక్బాల్ రణ్‌ధవా పిలుపునిచ్చారు.