Fireworks: అమెరికాలో బర్త్ డే సెలబ్రేషన్స్‌కు క్రాకర్స్ కొరత!

అమెరికాలో బర్త్ డే సెలబ్రేషన్స్ కు క్రాకర్స్ లేకుండా పోయాయట. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ తో సంవత్సరం పాటు పనులు లేకుండా పోయాయి. దీంతో క్రాకర్స్ తయారుచేసేవాళ్లే లేరు. ఇక క్రాకర్స్ ఎక్కడి నుంచి వస్తాయి.

Fireworks: అమెరికాలో బర్త్ డే సెలబ్రేషన్స్‌కు క్రాకర్స్ కొరత!

Amercia Fire Works (2)

Updated On : June 24, 2021 / 3:41 PM IST

Fireworks: అమెరికాలో బర్త్ డే సెలబ్రేషన్స్ కు క్రాకర్స్ లేకుండా పోయాయట. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ తో సంవత్సరం పాటు పనులు లేకుండా పోయాయి. దీంతో క్రాకర్స్ తయారుచేసేవాళ్లే లేరు. ఇక క్రాకర్స్ ఎక్కడి నుంచి వస్తాయి. ఇప్పటివరకూ ఉన్న స్టాక్ అంతా సేల్ అయిపోవడంతో అక్కడ ఫైర్ క్రాకర్స్ దొరకడం లేదట.

ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే చాలా తక్కువ ప్రదేశాల్లో దొరుకుతున్నాయట. వాటికి కూడా ఎక్కువ మొత్తం వెచ్చించి మాత్రమే కొనుగోలు చేయాలట. ఇండస్ట్రీ పర్యవేక్షకులు దాదాపు 30శాతం సప్లై చైన్ ఆగిపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని అంటున్నారు.

గతేడాది యూఎస్ ఫైర్ వర్క్ ఎగుమతులు మొత్తం చైనా నుంచే వచ్చాయి. మొత్తం 2బిలియన్ డాలర్ల మార్కెట్ జరిగిందని అంటున్నారు. ఇదే కొరత కంటిన్యూ అయితే.. త్వరలో 76మిలియన్ పౌండ్ల కొరత చవిచూడాల్సి వస్తుందని అమెరికన్లు బాధపడుతున్నారు.

అదృష్టవశాత్తు సప్లై చైన్ దొరికిందంటే చాలా పెద్ద మొత్తంలో చెల్లించి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో 40డాలర్లు ఉన్న క్రాకర్ ఇప్పుడు 115డాలర్లకు అమ్ముతున్నారని ఇంగ్లీష్ మీడియా వెల్లడించింది.