Fish Spotted With Gold Ring Around Its Head After Wedding Band Lost On Norfolk Island
Gold Ring Fish around head in Norfolk Island : మానవుడు పారేసిన వ్యర్థాలన్నీ సముద్రాలను కలుషితం చేయడం ప్రపంచ సమస్యగా మారింది. ఈ హానికర వ్యర్థాలతో వన్యప్రాణాలకు ప్రాణసంకటంగా దాపరించింది. భారీ మొత్తంలో హానిక ప్లాస్టిక్ సముద్రాల్లోకి కలిసిపోతోంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రాల్లోని జంతుజాతుల మనుగడ సాగించడం కష్టంగా మారింది. చాలావరకు జలచరాలు ఈ ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా అంతరించిపోతున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. నార్ఫోక్ ద్వీపం ఒడ్డున ఒక చేప కనిపించిన తీరు కనిపిస్తే.. ఆందోళన కలిగిస్తోంది. సముద్ర జీవులకు మానవుడి వాడిపారేసిన వ్యర్థాలతో ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది.
నార్ఫోక్ ద్వీపం పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా బాహ్య భూభాగంలో ఉంది. న్యూజిలాండ్, న్యూ కాలెడోనియా మధ్య ఉంది. ఈ సముద్ర తీరంలో ఒక చేప మెడలో వెడ్డింగ్ బంగారపు ఉంగరంతో మెరిసింది. ఫిబ్రవరి 2021లో సుషాన్ ప్రియర్ అనే రెసిడెంట్ కొన్ని చేపలను గుర్తించారు. ఆ ఫొటోలను తన బ్లాగులో షేర్ చేశారు. ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు సముద్రంలోని అడుగుభాగానికి చేరుకుంటాయి. ఎవరో తమ వెడ్డింగ్ రింగును సమద్రంలో పొగట్టుకున్నారు. ఆ బంగారం ఉంగరం సముద్రం అడుగుభాగానికి చేరుకుంది.
సముద్రంలోని ఇసుకలో అవి అంటిపెట్టుకునిపోతాయి. ఆహారం కోసం వెతుకుతూ తిరిగే చేపలు వంటి జలచరాలకు ఈ వ్యర్థాలు ప్రాణసంకటంగా మారాయి. ఆహారం కోసం వెతికే క్రమంలో ఒక ఉంగరం లేదా హెయిర్ టై చేపల ముక్కకు చిక్కుకోవడం వంటి జరుగుతుంటాయని ప్రియర్ అభిప్రాయపడ్డారు. చేప మెడకు ఏదో చుట్టుకున్నట్టుగా కనిపించిందని, దగ్గరగా పరిశీలిస్తే.. అది మెరిసే విలువైన బంగారపు ఉంగారమని గ్రహించారు.