five lions escaped
Five Lions Escape : ఆస్ట్రేలియాలోని ‘జూ’ నుంచి ఐదు సింహాలు తప్పించుకున్నాయి. సిడ్నీలో ఉన్న టారొంగా జూ ఎన్‌క్లోజర్ నుంచి ఐదు సింహాలు తప్పించుకున్నాయి. వాటిలో ఒక సింహంతో పాటు నాలుగు సింహం పిల్లలు ఉన్నాయి. దీంతో జూ పరిసరాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. జూలో లాక్‌డౌన్ అమలు చేశారు. ఓ సింహాం పిల్లను పట్టుకునేందుకు దానికి మత్తు ఇవ్వాల్సి వచ్చింది.
కానీ ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వచ్చిన కొన్ని క్షణాల్లోనే వాటిని మళ్లీ బంధించారు. అయితే ఆ సింహాలు ఎన్‌క్లోజర్ నుంచి ఎలా తప్పించుకున్నాయో ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ ఘటనపై విచారణ చేపట్టనున్నట్లు జూ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సైమన్ డఫీ పేర్కొన్నారు.
‘Mario Rides’ Video Viral: నడివీధుల్లో ‘మారియో కార్ట్’ వేషంలో స్కూటర్‌పై రేసింగ్ గేమ్.. బాణసంచా
ఎన్‌క్లోజర్ నుంచి సుమారు 100 మీటర్ల దూరం వరకు సింహాలు వెళ్లినట్లు తెలిపారు. సింహాలు బయటకు వచ్చిన సమయంలో ప్రధాన జూను మూసివేసి ఉంచినట్లు వెల్లడించారు. బోను నుంచి సింహాలు తప్పించుకున్న 10 నిమిషాల్లోనే అలారమ్ మోగినట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా గుర్తించారు.