‘Mario Rides’ Video Viral: నడివీధుల్లో ‘మారియో కార్ట్’ వేషంలో స్కూటర్‌పై రేసింగ్ గేమ్.. బాణసంచా

మొబైల్ ఫోన్లలో మారియో కార్ట్ రేసింగ్ గేమ్స్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా ఆడతారు. అయితే, ఓ వ్యక్తి మారియో కార్ట్ లా వేషం వేసుకుని స్కూటర్‌పై నడివీధుల్లో తిరుగుతూ హల్ చల్ చేశాడు. అంతేకాదు, స్కూటర్ పై వెళ్తున్న సమయంలో బాణసంచాను కాల్చాడు. స్కూటర్ వెనుక భాగంగా నుంచి రాకెట్లు పైకి దూసుకువెళ్లాయి. అతడి చేష్టలు అందరినీ ఆశ్చర్చపరుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.

‘Mario Rides’ Video Viral: నడివీధుల్లో ‘మారియో కార్ట్’ వేషంలో స్కూటర్‌పై రేసింగ్ గేమ్.. బాణసంచా

‘Mario Rides’ Video Viral: మొబైల్ ఫోన్లలో మారియో కార్ట్ రేసింగ్ గేమ్స్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా ఆడతారు. అయితే, ఓ వ్యక్తి మారియో కార్ట్ లా వేషం వేసుకుని స్కూటర్‌పై నడివీధుల్లో తిరుగుతూ హల్ చల్ చేశాడు. అంతేకాదు, స్కూటర్ పై వెళ్తున్న సమయంలో బాణసంచాను కాల్చాడు. స్కూటర్ వెనుక భాగంగా నుంచి రాకెట్లు పైకి దూసుకువెళ్లాయి.

అతడి చేష్టలు అందరినీ ఆశ్చర్చపరుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. రెడిట్ లో ఓ వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశాడు. ‘‘మూర్ఖత్వంతో కూడిన పని.. అయినప్పటికీ ఇది నచ్చింది’’ అని పేర్కొన్నాడు. 26 క్షణాల పాటు ఉన్న ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

స్కూటర్ పై వెళ్తూ వీధుల్లో బాణసంచా వదిలిన అతడిని కొందరు తిడుతుంటే మరికొందరు మాత్రం మెచ్చుకుంటున్నారు. ఇటువంటివి టీవీలు, వీడియో గేమ్స్ లో మాత్రమే చూస్తామని ఇప్పుడు రోడ్లపై కూడా చూడాల్సి వస్తుందని కొందరు పేర్కొన్నారు. అతడు వదిలిన బాణసంచా ఎవరి ఇంట్లోనైనా పడితే పరిస్థితి ఏంటని ఓ యూజర్ ప్రశ్నించాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..