Arkansas Plane Crashes: యూఎస్‌లో కూలిన ట్విన్ ఇంజిన్ విమానం.. ఐదుగురు దుర్మరణం

అమెరికాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నాన్-కమర్షియల్, ట్విన్ ఇంజిన్ విమానం టేకాప్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో అందులో ప్రయాణీస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

plane crashes

Arkansas Plane Crashes: అమెరికాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నాన్-కమర్షియల్, ట్విన్ ఇంజిన్ విమానం టేకాప్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో అందులో ప్రయాణీస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదం అర్కాన్కాస్‌లోని పులాస్కీ కౌంటీలో చోటు చేసుకుంది. ఆర్కాన్సాస్ టైమ్స్ నివేదిక ప్రకారం.. బిల్ మరియు హిల్లరీ క్లింటన్ జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే మధ్యాహ్నం సమయంలో ట్విన్ ఇంజిన్ల విమానం కూలిపోయింది.

Plane Crashes: పొగ మంచు కారణంగా గుడిని ఢీకొన్న విమానం.. పైలట్ మృతి

ఒహియోలోని కొలంబస్‌లోని జాన్‌గ్లెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకి వెళ్లే క్రమంలో ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో ఉన్నది లిటిల్ రాక్ ఆధారిత కన్సల్టెన్సీ అయిన సీటీఈహెచ్ ఉద్యోగులని సంస్థ తెలిపింది. ట్విన్ ఇంజిన్ విమానం కుప్పకూలడంతో పైలట్‌తో సహా విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు లిటిల్ రాక్ అధారిత పర్యావరణ సలహా సంస్థ ధృవీకరించింది. విమానాశ్రయం నుంచి కేవలం రెండు మైళ్ల దూరంలో ఈ విమానం కూలిపోయిందని పోలీసులు తెలిపారు.

Plane Crashes In Colombia : భవనంపై కుప్పకూలిన విమానం.. స్పాట్‌లో ఎనిమిది మంది మృతి..

పశ్చిమ వాయువ్య దిశ నుంచి బలమైన గాలులతో కూడిన జల్లులు తూర్పువైపు వేగంగా కదులుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని వాతావరణ శాస్త్రవేత్త జేమ్స్ బ్రయంట్ తెలిపారు. మధ్యాహ్నం 12.02 గంటల సమయంలో విమానం కూలిపోగా.. ఆ సమయంలో 56ఎంపీహెచ్ వేగంతో గాలి వీచినట్లు బ్రయంట్ చెప్పారు. ట్విన్ ఇంజిన్ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఫెడరల్ నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేప్టీ బోర్డ్ దర్యాప్తు చేస్తోంది.