Takeda Dengue Vaccine : భారత్‌కు డెంగీ వ్యాక్సిన్.. ఆమోదం ఒక్కటే ఆలస్యం!

జపాన్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ (Takeda) అభివృద్ధి చేసిన డెంగీ వ్యాక్సిన్ భారతదేశంలో వినియోగానికి ఆమోదం కోసం ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీతో చర్చలు జరుపుతోంది.

For India, Finally A Dengue Vaccine In Sight

Takeda dengue vaccine : ఇండియాకు డెంగీ వ్యాక్సిన్ అతి చేరువలో ఉంది. జపాన్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ (Takeda) అభివృద్ధి చేసిన డెంగీ వ్యాక్సిన్ (Dengue Vaccine) భారత్‌లో వినియోగానికి ఆమోదం కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే భారతీయ ఔషధ నియంత్రణ సంస్థ (Indian drug regulator)తో జపాన్ కంపెనీ చర్చలు జరుపుతోంది. డెంగ్యూ వ్యాక్సిన్ కు సంబంధించి ట్రయల్స్ నిర్వహించగా.. 83.6శాతం మంది ఆస్పత్రిలో చేరడాన్ని నిరోధించింది. అలాగే డెంగ్యూ వ్యాప్తిని 62శాతం తగ్గించినట్టు రుజువైంది.

జపాన్ డెంగ్యూ TAK-003 వ్యాక్సిన్‌కు ఇండియాలో ఆమోదం లభిస్తే.. దేశంలో మొట్టమొదటిగా భారత డ్రగ్ రెగ్యులేటరీ నుంచి క్లియరెన్స్ పొందిన డెంగీ వ్యాక్సిన్ ఇదే (Takeda) అవుతుంది. ఇప్పటికే  ట్రయల్స్ లో పాల్గొన్నవారిలో ఈ వ్యాక్సిన్ పిల్లలు, పెద్దల్లో తీవ్రమైన వ్యాధిని నిరోధించినట్టు ఫలితాల్లో వెల్లడైంది. డెంగ్యూ వ్యాక్సిన్ ఇండియాలో ఆమోదం కోసం Takeda ప్రయత్నాలు చేస్తోంది.
Dengue Vaccine : డెంగ్యూ వ్యాక్సిన్‌ కోసం విస్తృతంగా ట్ర‌య‌ల్స్ : డా.బ‌ల్‌రామ్ భార్గ‌వ్

ఈ నేపథ్యంలో సంస్థ తాత్కాలిక జనరల్ మేనేజర్ సైమన్ గల్లాఘర్ మాట్లాడుతూ.. మా వద్ద గ్లోబల్ డేటా ఉందన్నారు. డెంగీ వ్యాక్సిన్ భారతదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అనుమతుల కోసం భారత రెగ్యులేటరీతో చర్చలు జరుపుతున్నామని ఆయన అన్నారు. వీలైనంత త్వరగా ఇండియాకు వ్యాక్సిన్ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దోమ కాటును నివారించడం ద్వారా మాత్రమే డెంగీని నివారించవచ్చు. మరోవైపు సమర్థవంతమైన వ్యాక్సిన్ డెంగీ మరణాలను తగ్గించడంలో సాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇటీవలే డెంగీ వ్యాక్సిన్‌కు సంబంధించి మ‌రింత విస్తృతంగా ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఐసీఎంఆర్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ బ‌ల్‌రామ్ భార్గ‌వ్ తెలిపారు. డెంగీ వ్యాక్సిన్ చాలా ముఖ్య‌మైనదిగా పేర్కొన్నారు. కొన్ని డెంగీ స్ట్రెయిన్ల‌పై ప్ర‌స్తుతం ఇండియాలో అధ్య‌య‌నం సాగుతోంద‌ని, ఆ కంపెనీలు చాలా వ‌ర‌కు విదేశాల్లో తొలి ద‌శ ట్ర‌య‌ల్స్ నిర్వహించినట్టు చెప్పారు. ఇండియాలో ఎక్కువ స్థాయిలో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్లు ఐసీఎంఆర్ చీఫ్ వెల్లడించారు.
Telangana Dengue : హైదరాబాద్ లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు