నయాగార జలపాతం కదులుతూ ఉండగా.. త్రివర్ణ పతాకం ఎగురుతుంటే చూడడానికే ఎంత బాగుంటుందో.. జయహో భారత్. అనిపించే అటువంటి ఘటనే నిజంగా జరిగింది. నయాగారా వాటర్ ఫాల్స్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.
ఇండియా మొత్తం 2020 ఆగష్టు 15న 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్లు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కెనడాలోని ఐకానిక్ నయాగారా వాటర్ ఫాల్స్ వద్ద చరిత్రలో తొలిసారి త్రివర్ణ పతాకం ఎగిరింది. ఈ జెండా మహోత్సవాన్ని ఆగష్టు 15సాయంత్రం నిర్వహించారు.
భారత జాతీయ జెండా కెనడాలోని మరికొన్ని లొకేషన్లలోనూ ఎగరనుంది. 553 మీటర్ల ఎత్తు ఉన్న సీఎన్ టవర్, టొరంటో వద్ద ఆదివారం త్రివర్ణ పతాకిన్ని ఆవిష్కరిస్తారు. శని, ఆదివారాల్లో టోరంటోలోని సిటీ హాల్ వద్ద త్రికోణాకారం ఉంచి దానిని భారత జాతీయ జెండా రంగులతో అలంకరిస్తారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా పలు చోట్ల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఆన్ లైన్ లోనే ముగిశాయి. ఒట్టవాతో పాటు టొరంటోలోని కాన్సులేట్స్ ఇండియన్ హై కమిషన్ సంప్రదాయంగా నిర్వహించిన భారత జెండా ఆవిష్కరణను లైవ్ లో ప్రసారం చేశాయి.
కెనడాలో ఉండే వేల కొద్ది ఇండియన్ కమ్యూనిటీ ప్రజలు ఇండియా డే పరేడ్ లో చేసిన సంప్రదాయల గురించి ఆన్ లైన్లో వీడియోల రూపంలో పంచుకుంటూ ఉంటారు. కరోనా వైరస్ నిబంధనలకు అనుగుణంగా నిమిత్తం కెనడాలోని ఫుడ్ ఫెస్టివల్.. టేస్ట్ ఆఫ్ ఇండియాను కూడా నిర్వహిస్తున్నారు. ఇండియన్ సెలబ్రిటీ చెఫ్ లతో, భారత వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది.
Toronto gears up for virtual India day parade! #IndependenceDay2020 @_apoorvasri @HCI_Ottawa @Ajaybis @IndianDiplomacy @ICCR_Delhi https://t.co/5YcpLuQX6j
— IndiainToronto (@IndiainToronto) August 11, 2020