Foreign Visas : ఫారెన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? భారతీయులకు కేవలం 24 గంటల్లోనే వీసాను అందించే 8 దేశాలివే..!

Foreign Visas : వీసా లేకుండా విదేశాలకు వెళ్లడం కుదరదు. వీసాలను వేగంగా అందించే అనేక దేశాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

Foreign Visas

Foreign Visas : విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, చాలా దేశాల్లో వీసా అంత తొందరగా రాదు. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం వీసా ప్రక్రియ చాలా ఈజీగా ఉంటుంది. అప్లయ్ చేసిన వెంటనే వీసా పొందవచ్చు. మరికొన్ని దేశాలు వీసా ఇచ్చేందుకు నెల పడుతుంది.

Read Also : Xiaomi Phones : బిగ్ అలర్ట్.. ఇకపై ఈ షావోమీ ఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ రావు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

భారతీయులు వీసాను 24 గంటల నుంచి 48 గంటల్లో లేదా గరిష్టంగా 72 గంటల్లో పొందవచ్చు. భారతీయ పౌరులకు తక్షణ వీసా అందించే 8 దేశాల వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

సింగపూర్ :
భారతీయులకు సింగపూర్ వీసా చాలా ఈజీ. ఈ-వీసా వ్యవస్థ వేగంగా ఉంటుంది. కొన్నిసార్లు వీసా కేవలం 24 గంటల నుంచి 48 గంటల్లోనే వస్తుంది. మెరీనా బే సాండ్స్, గార్డెన్ బై ది బే విజిట్ చేయాలనుకున్నా వీసా కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు.

మలేషియా :
మలేషియాకు అనేక వీసా ఆప్షన్లు ఉన్నాయి. ఇ-వీసా లేదా eNTRI ఏదైనా వీసాను కేవలం 24 గంటల నుంచి 72 గంటల్లో సులభంగా పొందవచ్చు. కౌలాలంపూర్‌లో షాపింగ్ చేయాలనుకున్నా లంకావిలోని బీచ్‌ సందర్శించాలనుకున్నా మలేషియా వీసాను పొందవచ్చు.

ఇండోనేషియా :
భారతీయ పర్యాటకుల కోసం ఇండోనేషియా వీసా ఆన్ అరైవల్ (VOA) సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఈ వీసాకు ముందస్తు దరఖాస్తు అవసరం లేదు. దేశానికి చేరుకున్న వెంటనే విమానాశ్రయంలో వీసా తక్షణమే లభిస్తుంది. ప్రయాణికులకు ఇండోనేషియా బాలి బీచ్‌లను సులభంగా చూసి రావచ్చు.

జపాన్ :
జపాన్ టెక్నాలజీపరంగా బాగా పాపులర్. అలాగే వీసా ప్రక్రియ కూడా అంతే వేగంగా ఉంటుంది. ఇతర దేశాల కన్నా జపాన్ వీసా ప్రక్రియకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కానీ, భారతీయ ప్రయాణికులు సాధారణంగా 7 రోజుల నుంచి 10 రోజుల్లో వీసా పొందవచ్చు.

తైవాన్ :
భారతీయ ప్రయాణికులకు తైవాన్ ఇ-వీసా విధానం చాలా సులభం. దరఖాస్తు తర్వాత వీసా కేవలం 2 నుంచి 3 వారపు రోజుల్లోనే పొందవచ్చు. తైవాన్ లోయలు, సాంస్కృతిక వైవిధ్యంతో పాటు ప్రయాణికులు రాజధాని తైపీ అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు.

వియత్నాం :
వీసా ప్రక్రియ చాలా సులభం. వియత్నాం హోయ్ ఆన్ లేదా హా లాంగ్ బే సముద్ర క్రూయిజ్‌ చూడాలనుకుంటే వియత్నాం ఇ-వీసా తప్పనిసరి. ఈ వీసాను మీరు కేవలం 3 నుంచి 5 వారపు రోజుల్లో పొందవచ్చు.

థాయిలాండ్ :
థాయిలాండ్ ఇ-వీసా ఆన్ అరైవల్ (eVOA) వ్యవస్థ ద్వారా ప్రయాణికులు తమ వీసాలను సులభంగా పొందవచ్చు. వీసాలు 24 గంటల నుంచి 72 గంటల్లో ప్రాసెస్ అవుతాయి.

Read Also : Credit Score : ఇలా చేస్తే.. మీ క్రెడిట్ స్కోర్ స్పీడ్‌గా పెంచుకోవచ్చు.. ఈ సీక్రెట్ టిప్స్ మీకోసమే..!

చియాంగ్ మాయిలోని దేవాలయాలు, ఫుకెట్‌లోని బీచ్‌ లేదా థాయ్ స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకున్నా సరే వెంటనే ఈ థాయిలాండ్ వీసాను ఇతర దేశాల కన్నా వేగంగా పొదవచ్చు.

జార్జియా :
జార్జియా ఇ-వీసా చాలా ఈజీ. 5 వారాల నుంచి 6 వారపు రోజుల్లో వీసా చేతికి వస్తుంది. జార్జియా ఇప్పుడు టూరిజం పరంగా బాగా అభివృద్ధి పొందుతోంది. వీసా సిస్టమ్ చాలా సులభంగా ఉండటమే ఇందుకు కారణం.