అరుదైన వ్యాధి అంట : ముషార్రఫ్ ఆరోగ్యం విషమం

పాక్ మాజీ అధ్యక్షడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన అనారోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను దుబాయ్ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. వ్యాధికి సంబంధించి కొంతకాలంగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే శనివారం(మార్చి-16,2019) రాత్రి ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా పూర్తిగా క్షీణించిందని, అత్యవసరంగా ఆయనను హాస్పిటల్ కు తరలించినట్లు ఆయన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్(APML) సెక్రటరీ జనరల్ మెహ్రీన్ ఆడమ్ మాలిక్ తెలిపారు. డాక్టర్లు ఆయనకు పూర్తిగా కోలుకునేంతవరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు పార్టీ నేతలు తెలిపారు.
Read Also : అనిల్ అంబానీ జైలుకేనా! : ఎరిక్సన్ కేసులో ఒక్కరోజే గడువు

అమిలోడోసిస్ రియాక్ష‌న్‌తో ముష్ర‌ర‌ఫ్ బాధ‌ప‌డుతున్నార‌ని డాక్ట‌ర్లు తెలిపారు.ఈ అరుదైన వ్యాధి కారణంగా ముష‌ర్ర‌ఫ్ త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డ‌లేక‌పోతున్నరని,నడవలేకపోతున్నారని తెలిపారు. ముషార్రఫ్ అమిలోడోసిస్ వ్యాధితో భాధపడుతున్నట్లు గతేడాది అక్టోబర్ లో APML ఓవర్సీస్ ప్రెసిడెంట్ అఫ్జల్ సిద్దిఖీ తెలిపారు. ఈ వ్యాధి కారణంగా ముషార్రఫ్ నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. ఇదే వ్యాధి కోసం లండ‌న్‌లో ఆయ‌న ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లు తెలిపారు.

నవంబర్-3,2007లో పాక్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు గాను మార్చి-31,2014న ముషార్రఫ్ పై రాజద్రోహం కేసు నమోదైంది. దీంతో మెడికల్ ట్రీట్మెంట్ కోసమంటూ 2016 మార్చిలో పాక్ విడిచి దుబాయ్ వెళ్లిన ఆయన తిరిగి పాక్ వెళ్లలేదు.

ట్రెండింగ్ వార్తలు