Pervez Musharraf : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్యం విషమం

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించింది. ఆయన్నువెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు  కొన్ని వార్తా సంస్ధల కధనాలు వెలువరించాయి.

Pervez Musharraf : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించింది. ఆయన్నువెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు  కొన్ని వార్తా సంస్ధల కధనాలు వెలువరించాయి.

78 ఏళ్ల ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా పని చేశారు. గత కొద్ది ఏళ్లుగా అనారోగ్యంతో ఉన్న ముషారఫ్ దుబాయ్ లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  2016 నుంచి ఆయన దుబాయ్ లోనే ఉంటున్నారు. అప్పటి నుంచి ఆయన తన స్వదేశమైన పాకిస్తాన్ కు తిరిగివెళ్లలేదు.

పాకిస్తాన్ లో పర్వేజ్ ముషారఫ్ పై దేశద్రోహం కేసు కూడా నమోదయ్యింది. విచారణకు స్వదేశం రావాలని కోర్టు పలుమార్లు నోటీసులు పంపించింది. అనారోగ్య కారణాలతో ఆయన స్వదేశానికి వెళ్లలేదు.  ముషారఫ్ కు గుండె, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముషారఫ్ ఆరోగ్యం మరింత క్షీణించటంతో ఆయనకు కృత్రిమ మార్గాల ద్వారా శ్వాస అందిస్తున్నట్లు వార్త సంస్ధలు కధనాలు ప్రచురించాయి.

కాగా   ఈ వార్తల నేపధ్యంలో ముషారఫ్ కుటుంబ సభ్యులు  ఆయన ఆరోగ్య పరిస్ధితి  వివరిస్తూ ట్వీట్ చేశారు.  ముషారఫ్ వెంటిలేటర్ పై లేరు… కానీ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు