Imran Khan and PM Modi
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి భారత్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. పలుసార్లు భారత విదేశాంగ వ్యవహారాలపై ప్రశంసలు కురిపించిన ఇమ్రాన్ ఖాన్.. ప్రస్తుతం రష్యా పేరును ప్రస్తావించి మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అంతేకాదు.. ఒకవేళ నా ప్రభుత్వం పడిపోకుంటే నేను భారత్ తరహాలో చేసేవాడనని చెప్పారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఓ వీడియోను ఇమ్రాన్ విడుదల చేశారు. ఇందులో భారత్ మాదిరిగానే నేను చేద్దామని అనుకున్నానని, కానీ, దురదృష్టవశాత్తు అది జరగలేదని అన్నారు.
Imran Khan Video: నన్ను జైల్లో వేసినా, చంపేసినా మీరు పోరాడండి: ఇమ్రాన్ ఖాన్ వీడియో సందేశం
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నపాక్‌కు చమురు దిగుమతి పెద్ద భారంగా పరిణమించింది. ప్రస్తుతం రంజాన్ మాసం సందర్భంగా చమురు సరఫరా పెంచాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రష్యా నుంచి వీలైనంత తక్కువ ధరకే చమురును కొనుగోలు చేసేందుకు పాక్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చౌకగా చమురు తీసుకుంటోందని ఇమ్రాన్ అన్నారు. విదేశాంగ విధానంలో ఇది అద్భుతం అని, భారత్ తరహాలో మేం కూడా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ను చౌకగా దిగుమతి చేసుకోవాలని అనుకున్నామని ఇమ్రాన్ తెలిపారు. ఈలోపు తన ప్రభుత్వాని పడగొట్టడం వల్ల అది సాధ్యంకాలేదని అన్నారు. తమ దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభానికి ప్రస్తుత ప్రభుత్వమే కారణమని విమర్శలు చేశారు. రష్యా క్రూడాయిల్‌ను సబ్సిడీ ధరకు తమ దేశం కొనుగోలు చేయలేక పోవటంతో తాను కలత చెందానని ఇమ్రాన్ అన్నారు.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు భారీగా వచ్చిన పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత
ఇమ్రాన్ ఖాన్ గతంలోనూ పలుసార్లు భారత విదేశాంగ విధానంపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైన ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ ను చూసి నేర్చుకోవాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదిలాఉంటే యుక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతి అయ్యే చమురుపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో తక్కువ ధరకే చమురును విక్రయించేందుకు రష్యా ముందుకొచ్చింది. భారత్ సైతం రాయితీ ధరకు ఆ దేశం నుంచి చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటుంది.