Imran Khan Video: నన్ను జైల్లో వేసినా, చంపేసినా మీరు పోరాడండి: ఇమ్రాన్ ఖాన్ వీడియో సందేశం

పాకిస్థాన్ ప్రజలకు ఓ సందేశం ఇస్తూ ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో పోస్ట్ చేశారు. తనను జైలులో ఉంచినా, చంపేసినా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. పాక్ ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’ కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. పోలీసులను అడ్డుకునేందుకు పీటీఐ పార్టీ కార్యకర్తలు ఇమ్రాన్ ఇంటి వద్దకు ప్రతిరోజు వస్తున్నారు.

Imran Khan Video: నన్ను జైల్లో వేసినా, చంపేసినా మీరు పోరాడండి: ఇమ్రాన్ ఖాన్ వీడియో సందేశం

Imran Khan Video: పాకిస్థాన్ ప్రజలకు ఓ సందేశం ఇస్తూ ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో పోస్ట్ చేశారు. తనను జైలులో ఉంచినా, చంపేసినా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. పాక్ ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’ కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. పోలీసులను అడ్డుకునేందుకు పీటీఐ పార్టీ కార్యకర్తలు ఇమ్రాన్ ఇంటి వద్దకు వస్తున్నారు. ఇమ్రాన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ వీడియో రూపంలో మాట్లాడారు.

“నన్ను అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారు. నేను జైలుకు వెళ్తే ఇక ప్రజలు పోరాడకుండా ఇంట్లో నిద్రపోతారని వారు భావిస్తున్నారు. వారు అనకుంటున్నది తప్పని మీరు నిరూపించాలి. మన జాతి బతికే ఉందని స్పష్టం చేయాలి. దేశంలో శాంతిభద్రతలను కాపాడడానికి దేశ ప్రజలు మద్దతు తెలపాలి. వీధుల్లోకి వచ్చి పోరాడాలి.

నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. మీ యుద్ధంలో నేను పోరాడుతున్నాను. నేను నా జీవితం మొత్తం పోరాడాను. ఇంకా పోరాడుతూనే ఉంటాను. కానీ, నాకేమన్న అయితే. నన్ను జైల్లో పెడితే లేదా చంపేస్తే.. నేను లేకున్నా పోరడతామని మీరు నిరూపించాలి. బానిసత్వాన్ని, ఒకే ఒక్క వ్యక్తి దేశాన్ని పరిపాలించడాన్ని మీరు ఎన్నటికీ అంగీకరించవద్దు” అని ఇమ్రాన్ ఖాన్ ప్రజలకు చెప్పారు.

కాగా, ‘తోషఖానా’ విషయంలో ఇమ్రాన్ తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయనకు వచ్చిన బహుమతుల్లో కొన్నింటిని అమ్మేశారని కేసులు ఉన్నాయి. ఆయన కోర్టుకు హాజరు కావట్లేదు. గాయం కారణంగా తాను రాలేనని అంటున్నారు. ఆయనపై సెషన్స్ కోర్టు జడ్జి ఇప్పటికే నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇమ్రాన్ ను అరెస్టు చేస్తే దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని పీటీఐ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

AP Assembly Budget Session-2023: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ.. LiveUpdates